డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 26, 2024 :స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో కాలేయ సంరక్షణ,ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు.

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి, ఈ ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సంస్థ ఏర్పాటుకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, “లివర్ అనేది శరీరానికి అత్యంత కీలకమైన అవయవం. కాలేయ సంరక్షణకు ప్రత్యేకమైన వైద్యసదుపాయాలు అందించేందుకు హైదరాబాద్‌లో ఇలాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమవడం గర్వకారణం. ఇది ప్రజల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం” అని అన్నారు.

ఇన్‌స్టిట్యూట్‌ను రూపొందించిన డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ సంస్థ భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి చేరుకుంటుందని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుల ప్రకారం, ఈ సంస్థ ద్వారా ప్రజలకు అత్యుత్తమ లివర్ సంరక్షణ,ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌స్టిట్యూట్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్, డైరెక్టర్ డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గుడపాటి లు, రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రసిద్ధ వైద్య నిపుణులు, ప్రముఖులు, ఇతర అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆసుపత్రి సౌకర్యాలు,సేవలను ప్రశంసించారు.