
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, డిసెంబర్ 3, 2024: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (FES) 2024 నవంబర్‌లో ట్రాక్టర్ అమ్మకాల గణాంకాలను వెల్లడించింది.
ఈ ప్రకారం, 2024 నవంబర్‌లో దేశీయ మార్కెట్‌లో 31,746 యూనిట్లు విక్రయించాయి. ఇది 2023 నవంబర్‌తో పోలిస్తే 2% పెరుగుదలని సూచిస్తుంది (31,069 యూనిట్లుగా).
మొత్తం ట్రాక్టర్ అమ్మకాలు (దేశీయ + ఎగుమతులు) 33,378 యూనిట్లుగా నమోదయ్యాయి, గతేడాది ఇదే నెలలో విక్రయించిన 32,074 యూనిట్లతో పోలిస్తే పెరుగుదల సాధించింది. ఇందులో 1,632 యూనిట్లు ఎగుమతి చేశారు.ఇది గత సంవత్సరం కంటే 62% పెరుగుదల.

ఈ అంశంపై వ్యాఖ్యానిస్తూ, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు: “2024 నవంబర్‌లో దేశీయ మార్కెట్లో మా ట్రాక్టర్ల అమ్మకాలు 2% పెరిగి 31,746 యూనిట్లకు చేరాయి.
ఖరీఫ్ హార్వెస్ట్ సీజన్ పూర్తయిన తరువాత రైతులు రబీ పంటల పనుల్లో ఉన్నారు. గతేడాది దీపావళి, ధన్‌తెరాస్ పండుగ సీజన్ మధ్య ఉన్న మార్పు కారణంగా పరిశ్రమలో స్వల్ప క్షీణత కనిపించింది.
రిజర్వాయర్ స్థాయిలు బాగుండటంతో, రబీ పంటలకు అధిక మద్దతు ధరలు ఉన్న నేపథ్యంలో రైతుల సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. రబీ పంటలో మంచి పురోగతి జరుగుతోంది.
మంచి రబీ పంట వర్షనాతో రాబోయే నెలల్లో ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, ఎగుమతులలో 62% పెరుగుదలతో 1,632 ట్రాక్టర్లను ఎగుమతి చేశాం.”

ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ వివరాలు | ||||||||||||||||||
నవంబర్ | YTD నవంబర్ | |||||||||||||||||
F25 | F24 | % మార్పు | F25 | F24 | % మార్పు | |||||||||||||
దేశీయ అమ్మకాలు | 31746 | 31069 | 2% | 302308 | 279129 | 8% | ||||||||||||
ఎగుమతులు | 1632 | 1005 | 62% | 11372 | 8475 | 34% | ||||||||||||
మొత్తం | 33378 | 32074 | 4% | 313680 | 287604 | 9% | ||||||||||||