
డైలీ మిర్రర్ న్యూస్, జూలై 15,2024: ఐటీ సర్వీసులు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ విభాగంలో గ్లోబల్ లీడరుగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (BSE: 532540, NSE: TCS) తమ టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ (InQuizitive) 2024 ఎడిషన్‌ను ప్రకటించింది. హైస్కూల్ విద్యార్థులకు వినూత్నమైన రీతిలో అభ్యాస అవకాశాన్ని కల్పించేలా ఇది రూపొందించబడింది. దేశ భవిష్యత్ తరం ప్రతిభావంతుల్లో నూతన టెక్నాలజీ నైపుణ్యాలను ఆడుతూ పాడుతూ పెంపొందించే విధంగా ఈ టీసీఎస్ ఫ్లాగ్‌షిప్ వార్షిక క్విజ్ ఉంటుంది.
12 నగరాలవ్యాప్తంగా భౌతికంగా, ఆన్-గ్రౌండ్‌లో నిర్వహించబోయే టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ 2024 ఎడిషన్ మరింత క్రియాశీలకంగా, ఆకట్టుకునే విధంగా ఉండనుంది. హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, చెన్నై, నాగ్‌పూర్, కోల్‌కతా, అహ్మదాబాద్, భువనేశ్వర్, ముంబై, పుణె, ఢిల్లీ ,కొచ్చిలో నిర్వహించబోయే ఈ క్విజ్ ఇటు పాల్గొనేవారు అటు వీక్షకులు కూడా ఆస్వాదించే విధంగా, థ్రిల్లింగ్‌గా ఉండనుంది. ప్రతి ప్రాంతీయ రౌండ్‌లో విజేతలు, రన్నర్స్-అప్‌లు ముంబైలో జరిగే సెమీ-ఫైనల్స్, ఫైనల్స్‌కి అర్హత దక్కించుకుంటారు.
ప్రీ-యూనివర్సిటీ, జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు 8 నుంచి 12వ తరగతుల వరకు స్కూల్ విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు ఉండదు. “డిజిటల్ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి వచ్చే కొన్నేళ్లలో భారత్‌కు 3 కోట్లకు పైగా డిజిటల్ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ అవసరమవుతారు. తదుపరి తరం ఆవిష్కర్తలు, సమస్యల పరిష్కర్తలతో ఎంగేజ్ అయ్యేందుకు, వారికి స్ఫూర్తినిచ్చేందుకు టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ అనేది ఒక అద్భుతమైన వేదిక కాగలదు.
అభ్యాస అనుభవాన్ని గేమింగ్ తరహాలో తీర్చిదిద్దడం, క్లాస్‌రూమ్ వెలుపలి ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థుల టెక్నాలజీ అభ్యాస పరిధిని మరింత విస్తరించేందుకు ఇది దోహదపడగలదు” అని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభినవ్ కుమార్ తెలిపారు.
1999లో భారత్‌లో అతి పెద్ద ఇంటర్-స్కూల్ ఐటీ క్విజ్‌లలో ఒకటైన టీసీఎస్ ఐటీ విజ్‌ను ప్రారంభించినప్పటి నుంచి రెండు దశాబ్దాలుగా క్విజ్జింగ్‌తో టీసీఎస్‌కి అనుబంధం ఉంది. ఒక టెక్నాలజీ సంస్థగా, యువతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నలాజికల్ ట్రెండ్‌ల విషయంలో అప్‌డేట్‌గా ఉండేలా తోడ్పడటంలో టీసీఎస్ సదా ముందుంటోంది.
గతేడాది నిర్వహించిన క్విజ్‌కి దేశవ్యాప్తంగా17,000 పైచిలుకు రిజిస్ట్రేషన్లు వచ్చాయి. టీసీస్ ఇన్‌క్విజిటివ్ 2024లో, వివిధ పరిశ్రమలు, రంగాలవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన విస్తృతాంశాలు ఉంటాయి.
క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి కొత్త విభాగాలను కూడా క్విజ్ స్పృశిస్తుంది. అలాగే విద్య, వినోదం, బ్యాంకింగ్, అడ్వర్టైజింగ్, క్రీడలు, సోషల్ మీడియా, మొబైల్ టెక్నాలజీ వంటి రంగాల్లో టెక్నాలజీ ప్రభావాన్ని కూడా కవర్ చేస్తుంది. ఐటీలో ప్రముఖ వ్యక్తులు, బ్రాండ్లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఐటీ చరిత్ర మొదలైన అంశాలపై ప్రశ్నలు ఉండవచ్చు.
టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎంట్రీలు సమర్పించాల్సి ఉంటుంది. టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ 2024 గురించి మరింత సమాచారం కోసం దయచేసి https://www.tcs.com/inquizitive ని సందర్శించండి.