
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఏప్రిల్ 19, 2025 : వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జి. ఎన్. నాష్, అజీజ్ చీమరువ, ప్రట్టీ జో, సన్, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా, డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో, లియోన్ ఆర్ భాస్కర్ సినిమాటోగ్రఫీ, నిహల్ సంగీతంతో రూపొందిన ఈ చిత్రం ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
స్టోరీ..
Read this also… How is Different Movie..?
Read this also… This Week’s OTT Picks: Thrillers, Comedies, Docu-Series & More Across Platforms
Read this also… Pallavi Model School Commemorates the Birth Anniversary of Marshal Arjan Singh, DFC
న్యూజిలాండ్‌లో వరుస హత్యలు జరుగుతున్నాయి, బాధితులంతా యువతులే. నగరంలో సైకో కలకలం సృష్టిస్తున్నాడని వార్తలు వస్తుంటాయి, పోలీసులు నగరమంతా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో బాబ్ (నితిన్ నాష్) ఒంటరిగా ఇంట్లో ఉంటాడు. అతన వాళ్ల అమ్మ సన్ ఒక గదిలో లాక్ చేసుకొని ఉంటుంది. అకస్మాత్తుగా ముగ్గురు అమ్మాయిలు బాబ్ ఇంట్లోకి చొరబడి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. బాబ్ ఒంటరిగా ఎందుకు ఉంటాడు? అతని తల్లి గదిలో ఎందుకు ఉంటుంది? ఈ అమ్మాయిలు ఎవరు? నగరంలో హత్యలు చేస్తుంది ఎవరు? ఇవే కథలోని కీలక అంశాలు.
విశ్లేషణ..
నితిన్ నాష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒంటరిగా ఉన్న భయం, ఆందోళనను అతను తన నటనలో అద్భుతంగా ప్రదర్శించాడు. తల్లి పాత్రలో సన్, ముగ్గురు అమ్మాయిల పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఒకే ఇంటిలో మొత్తం కథను నడిపించడం సవాలు, కానీ దర్శకుడు డ్రాగన్ ఉదయ భాస్కర్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

లియోన్ ఆర్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అద్భుతం. లైటింగ్, విజువల్స్ సినిమాకు బలం. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉండి, సినిమా పొడవు అతిగా అనిపించకుండా చేసింది. నిహల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల తీవ్రతను పెంచింది. దర్శకుడు ఉదయ భాస్కర్ తన విజన్‌తో సినిమాను బోరింగ్ లేకుండా నడిపించాడు.
Read this also… 100 Years of Caterpillar: Team India’s Role in Building a Better, more Sustainable World
Read this also… Soar into Summer: IndiGo Unveils Exciting Summer Sale with Unbeatable Offers
డిఫరెంట్ ఒక వినూత్న కథ, ఆకట్టుకునే కథనంతో ప్రేక్షకులను అలరిస్తుంది. థ్రిల్లర్ ప్రియులకు, విభిన్నమైన సినిమాలు చూడాలనుకునేవారికి ఈ చిత్రం ఒక ట్రీట్. చిత్ర యూనిట్‌కు అభినందనలు.
రేటింగ్: 3/5