డైలీ మిర్రర్ డాట్ న్యూస్,నవంబరు 21,2026: శబరిమల మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సౌత్ ఇండియన్ బ్యాంక్ భక్తుల కోసం పలు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో కలిసి తీసుకువచ్చిన ఈ సదుపాయాలలో భాగంగా సన్నిధానంలో ఏర్పాటు చేసిన అరవణ వెండింగ్ మెషీన్‌ను దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) ప్రారంభించారు.
Read this also:90% of Indian Firms Expanding Tech Teams for AI Growth: Randstad..
Read this also:Axis Bank Celebrates Women-Led MSMEs on Women’s Entrepreneurship Day..
ఈ యంత్రం ద్వారా భక్తులు స్వయంచాలక విధానంలో అరవణ ప్రసాదాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు చెందిన డిజిఎం , గవర్నమెంట్ బిజినెస్ హెడ్ రంజిత్ ఆర్. నాయర్; ఏజిఎం, తిరువనంతపురం రీజినల్ హెడ్ జాన్ సిరియాక్; తిరువనంతపురం మెయిన్ క్లస్టర్ హెడ్ రతీష్ పి., ; గవర్నమెంట్ బిజినెస్ చీఫ్ మేనేజర్ ప్రేమ్‌లాల్ ఆర్. ఎస్. పాల్గొన్నారు.
భక్తులు ప్రసాదాన్ని బుక్ చేసుకోవడం కోసం బ్యాంకు వారు సన్నిధానంలో ప్రత్యేక ఈ-కియోస్క్‌లను ఏర్పాటు చేశారు; బుక్ చేసుకున్న ప్రసాదాన్ని నిర్ణీత కౌంటర్ల వద్ద తీసుకోవచ్చు.
ఇదీ చదవండి:ఫాంటసీ థ్రిల్లర్‌గా ‘కెరూబ్’.. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలు!
ఇదీ చదవండి:బాల్డ్ హెడ్ కు ఎలక్ట్రిక్ కూంబ్.. 95శాతం హెయిర్ గ్యారెంటీ..
భక్తులు డిజిటల్‌గా కానుకలు సమర్పించేందుకు వీలుగా, డిజిటల్ చెల్లింపు కౌంటర్లు , క్యూఆర్ కోడ్ ఆధారిత ఇ-కనిక్క సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురాబడ్డాయి.
ఈ సేవలు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించాయి. ఇక్కడ భక్తులు డిజిటల్ కియోస్క్ ద్వారా ‘అప్పం’,’అరవణ’లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు, అలాగే ఈ-కానుకలను సమర్పించవచ్చు.

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సిఐఏఎల్ ) , ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం ద్వారా భక్తులు విమానాశ్రయంలోనే ప్రసాదాన్ని బుక్ చేసుకుని, సన్నిధానంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ కౌంటర్ల వద్ద వాటిని పొందవచ్చు.
ఈ కార్యక్రమాల ద్వారా, సౌత్ ఇండియన్ బ్యాంక్ శబరిమల యాత్రలోని వివిధ దశలలో డిజిటల్ చెల్లింపు , బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది.
తద్వారా భక్తులకు అవసరమైన సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు, వార్షిక యాత్రను నిర్వహించేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు కూడా మద్దతునిస్తోంది.

