డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 21, 2025: ప్రముఖ ఆధ్యాత్మిక గాయని అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్​ కాన్సర్ట్​ హైదరాబాద్​లోని మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ – నోవోటెల్ వేదికపై విజయవంతంగా జరిగింది.

చల్​ మన్​ వృందావన్ సంస్థ, రాధాకృష్ణ అకేషన్స్​ సహకారంతో సెప్టెంబర్ 20న జరిగిన ఈ కార్యక్రమంలో, అచ్యుత గోపి తన ఆత్మను తాకే గీతాలు, మధురమైన భక్తి సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

నోవోటెల్‌లో నిర్వహించిన వర్చువల్​ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భగవద్గీత, భాగవతం గొప్పతనాన్ని, మన భారతీయ సంప్రదాయం, సంస్కృతి ప్రాముఖ్యతను వివరించారు. హైదరాబాద్‌కి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని, కృష్ణుడు తన జీవితంలో వెలుగును నింపారని, అందుకే ఆయన పట్ల అపారమైన భక్తిభావం ఉందని తెలిపారు.

తెలుగు ప్రజల్లో ఉన్న భక్తిభావం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, త్వరలో హైదరాబాద్‌లో మరో కచేరీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. అలాగే, రాధాకృష్ణుల జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను కూడా పంచుకున్నారు. మరో పదిహేను రోజుల్లో తెలుగు ప్రజలను కలుస్తానని ఆమె పేర్కొన్నారు.

అచ్యుత గోపి తన సంగీత ప్రయాణంలో భాగంగా, అక్టోబర్ 4న గచ్చిబౌలిలో మరో లైవ్ కాన్సర్ట్‌తో హైదరాబాద్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఆధ్యాత్మిక సంగీత విభావరి టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటోలో అందుబాటులో ఉన్నాయి. https://www.district.in/