డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్‌,జనవరి 17,2026: మలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కటాలన్’ (Kattalan) టీజర్ విడుదలైంది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌తో పాటు సెకండ్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా, వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో పోరాట ఘట్టాలు
ఏనుగుల వేట నేపథ్యంలో ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని సుందరమైన లొకేషన్లలో అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ఓంగ్-బాక్’ సిరీస్ చిత్రాల్లో నటించిన “పాంగ్” అనే ఏనుగు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘మార్కో’ వంటి ఘనవిజయం తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read this also:Glittering finale to ‘Euphoria 2026’: Artistry and academic excellence shine at Kiran International School..

ఇదీ చదవండి..:Campa Sure : రిలయన్స్ ‘క్యాంపా ష్యూర్’ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బి అమితాబ్ బచ్చన్..!

బలమైన తారాగణం.. అద్భుతమైన సంగీతం
ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్, రాజ్ తిరందాసు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుషారా విజయన్ కథానాయికగా నటిస్తుండగా, కబీర్ దుహాన్ సింగ్, జగదీష్, సిద్ధిక్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ‘కాంతార’, ‘మహారాజ’ వంటి చిత్రాలకు అద్భుతమైన స్వరాలు అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఉన్నీ ఆర్ డైలాగ్స్ అందిస్తుండగా.. జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ కథ, స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు.

ఇదీ చదవండి..:తొలి వార్షిక సామాజిక బాధ్యత నివేదికను విడుదల చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

ఇదీ చదవండి..:క్రికెట్ ప్రపంచంలో హ్యుందాయ్ హవా: ఐసీసీ టోర్నీలకు ‘ప్రీమియర్ పార్టనర్‌’గా ఒప్పందం

చిత్రీకరణ పూర్తి కాకముందే ‘కటాలన్’ భారీ ఓవర్సీస్ డీల్స్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదలయ్యే చిత్రంగా ఇది నిలవనుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మే 14, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.