డైలీ మిర్రర్ డాట్ న్యూస్,బెంగళూరు,డిసెంబర్ 1,2024: భారతదేశంలోని అతిపెద్ద,వేగంగా అభివృద్ధి చెందుతున్న సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవల సంస్థల్లో ఒకటైన ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ లిమిటెడ్ (“ఆస్టర్”),బ్లాక్‌స్టోన్, టీపీజీ పెట్టుబడులు గల క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (“క్యూసిఐఎల్” లేదా “క్వాలిటీ కేర్”), అభివృద్ధి చెందుతున్న నగరాలపై దృష్టి సారించి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు ఆసుపత్రి చెయిన్‌లలో ఒకటిగా తయారవ్వడానికి ఖచ్చితమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

ఈ విలీనాన్ని సంబంధిత కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాయి. ఇది రెగ్యులేటరీ, కార్పొరేట్,వాటాదారుల ఆమోదాలను పొందాల్సి ఉంటుంది. విలీనం చేసిన లిస్టెడ్ సంస్థ పేరు ఆస్టర్ DM క్వాలిటీ కేర్ లిమిటెడ్ గా ఉంటుందని వెల్లడించారు.

విలీనం తర్వాత సంస్థలో ఉన్న బ్రాండ్లు: ఆస్టర్ DM, కేర్ హాస్పిటల్స్, కిమ్స్ హెల్త్, ఎవర్ కేర్. ఈ సంయుక్త సంస్థ 27 నగరాల్లో 38 ఆసుపత్రులు, 10,150+ పడకల నెట్‌వర్క్‌తో భారతదేశంలోని టాప్ 3 హాస్పిటల్ చైన్‌లలో ఒకటిగా ఉంటుంది.

విలీనానికి కారణాలు:

ప్రధాన స్థాయి: దక్షిణాది,మధ్య భారతదేశం ప్రాంతాలలో గలపటిష్టమైన కార్యకలాపాలతో ఆదాయం,పడకల సంఖ్య (38 ఆసుపత్రులు & 10,150+ పడకలు) పరంగా భారతదేశంలోని టాప్ 3 హాస్పిటల్ చైన్‌లలో ఒకటిగా నిలవడం.
మెరుగైన ఆర్థిక సామర్ధ్యం: లావాదేవీ పూర్తి అయిన తర్వాత అత్యుత్తమ మార్జిన్లు,రాబడులతో మరింత పటిష్టమైన ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాలు.
క్రమానుగత వృద్ధి: EPS పరంగా విలీనంతో మరింత క్రమానుగత వృద్ధి అంచనా.
విస్తరణ: 360-డిగ్రీల కోణంలో వృద్ధి చెందుతున్న ల్యాబ్స్, క్లినిక్స్ ,ఫార్మసీల వ్యవస్థతో తొమ్మిది భారతీయ రాష్ట్రాలలో విస్తరణ.
సమష్టి సామర్థ్యాలు: ఆదాయం, ప్రొక్యూర్‌మెంట్ & సప్లై చైన్, కేపెక్స్,కార్పొరేట్ కార్యకలాపాల ఏకీకరణతో సమష్టి సామర్ధ్యాలు మెరుగుపడతాయని అంచనా.
వృద్ధి అవకాశాలు: బ్రౌన్ ‌ఫీల్డ్,గ్రీన్ ‌ఫీల్డ్ విస్తరణకు గణనీయమైన అవకాశాలు (FY24-27 మధ్య సుమారు 3,500 కొత్త పడకల ఏర్పాటు అంచనాలు).

గ్లోబల్ ఇన్వెస్టర్ల మద్దతు: బ్లాక్‌స్టోన్,టీపీజీ వంటి ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్ల మద్దతు.

ఆస్టర్ DM హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు,ఛైర్మన్ డాక్టర్ ఆజాద్ మూపెన్:
“ఈ విలీనం ద్వారా రోగుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి, కొత్త ఆవిష్కరణలు, సేవల యాక్సెసిబిలిటీతో ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన ప్రమాణాలను ఏర్పరచగలగాం. దీని ద్వారా ఆస్పత్రి సేవలు మరింత మెరుగుపడతాయి.”

బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా హెడ్ అమిత్ దీక్షిత్:
“ఇది భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగేందుకు ఆసక్తికరమైన భాగస్వామ్యం.”

ఆస్టర్ DM హెల్త్ కేర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీషా మూపెన్:
“ఈ విలీనం ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మరింత మెరుగుపర్చే శక్తిమంతమైన సంస్థగా ఎదుగుతాం. మా పోటీ సంస్థలతో పోలిస్తే మరింత విజయవంతంగా ఉండాలని ఆశిస్తున్నాం.”