డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, ఏప్రిల్ 29, 2025: అక్షయ తృతీయ శుభదినాన్ని పురస్కరించుకుని, భారతదేశపు వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ (AFL) తన కొత్త ఉత్పత్తి ‘దిశ హోమ్ లోన్స్’ ను ఆవిష్కరించింది. ఈ హోమ్ లోన్ సేవలు ప్రధానంగా ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) మరియు అల్పాదాయ వర్గాల (LIG) గృహ కొనుగోలు దారులను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ లోన్ ఉత్పత్తి సెలారీడ్ (రెసిడెంట్ & ఎన్నారై), స్వయం ఉపాధి, సెమీ ఫార్మల్, అసంఘటిత ఆదాయ వర్గాలు వంటి విభిన్న ఆదాయ వర్గాలకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని – రెడీ ఫ్లాట్లు, నిర్మాణంలో ఉన్న యూనిట్లు, రీసేల్ ప్రాపర్టీలు, ప్లాట్+నిర్మాణం, స్వయంగా నిర్మించుకునే ఇళ్లు, గృహ అభివృద్ధి మరియు విస్తరణకు – ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు.

అనుభవంలో నిరాటంకత, అమలులో వేగం, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా హైపర్-లోకలైజ్డ్ సేవలు మరియు టెక్నాలజీ ఆధారిత విధానాలు ఈ ఉత్పత్తిని ప్రత్యేకతను పెంచుతున్నాయి.

ఈ సందర్భంగా యాక్సిస్ ఫైనాన్స్ ఎండీ మరియు సీఈఓ శ్రీ సాయి గిరిధర్ మాట్లాడుతూ, “‘దిశ హోమ్ లోన్స్’ ద్వారా గృహం కలను నెరవేర్చాలనే తపన ఉన్న వర్గాలకు మద్దతుగా నిలుస్తాం. ఇది ప్రభుత్వ హౌసింగ్ ఫైనాన్స్ లక్ష్యాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసే దిశగా సాగుతుంది” అన్నారు. అలాగే, టెక్నాలజీ, డేటా సైన్స్, పారదర్శకత మరియు సేవల నాణ్యతతో దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

సురక్షిత మార్టిగేజ్ రంగంలో పటిష్ట అనుభవం కలిగిన యాక్సిస్ ఫైనాన్స్ – దిశ హోమ్ లోన్స్ ద్వారా మరింత విస్తృతమైన మరియు వినూత్న పరిష్కారాలను అందించేందుకు సిద్ధమైంది.