డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, 13 నవంబర్ 2024: భారతదేశంలోని కోట్లాది మంది పౌరుల రిటైర్మెంట్ సేవింగ్స్‌ను సరళతరం చేసే దిశగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థ ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌బీఎస్ఎల్) భీమ్ యాప్ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) చందా చెల్లింపు ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఫీచర్ భారత్ కనెక్ట్ సాయంతో సురక్షితమైన, సులభంగా అందుబాటులో ఉన్న రిటైర్మెంట్ సేవింగ్స్ సొల్యూషన్‌ను అందిస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా, భీమ్ యూజర్లు ఇకపై తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్,కొద్దిపాటి వివరాలతోనే తమ ఎన్‌పీఎస్ ఖాతాలోకి సులభంగా చందా కట్టవచ్చు. సంక్లిష్టమైన వివరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, కొద్ది క్లిక్‌లతోనే రిటైర్మెంట్ ప్రణాళికను అమలు చేసుకునే వీలు కలుగుతుంది. భీమ్ ద్వారా చేసిన చందా, ఒక వ్యాపార పనిదినంలోనే పూర్తిగా ప్రాసెస్ అవుతుంది.ఇన్వెస్ట్ చేయబడుతుంది.
భీమ్‌లో ఎన్‌పీఎస్ చందాలను ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్యమైన ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీని ద్వారా భారతదేశంలోని కోట్లాది మంది పౌరులు రిటైర్మెంట్ ప్రణాళికలపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక భద్రతను కలిగి ఉండేలా చేస్తామని ఎన్‌బీఎస్ఎల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ హాండా తెలిపారు. ఇది భీమ్‌ను సమగ్ర ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాంగా మార్చే దిశగా కీలక ముందడుగు అని ఆయన అన్నారు.
భారత్ కనెక్ట్ సాయంతో ఇప్పుడు భీమ్‌లోనే ఎన్‌పీఎస్ పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినందుకు సంతోషిస్తున్నామని, భారతదేశ పౌరులందరికీ ఆర్థిక సాధనాలను మరింత సులభతరంగా అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యమని ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్‌బీబీఎల్) సీఈవో నూపుర్ చతుర్వేది తెలిపారు.
సెప్టెంబర్ 2024 నాటికి 38.25 లక్షల రిటైల్ ఖాతాల స్థాయికి ఎన్‌పీఎస్ భారీ వృద్ధిని సాధించింది. భవిష్యత్‌లో మరింత మంది వినియోగదారులు ఎన్‌పీఎస్‌లో చేరి రిటైర్మెంట్ కోసం విశ్వసనీయ ఆదాయ మార్గాన్ని సృష్టించుకునేందుకు ఈ కొత్త ఫీచర్ ఎంతో సహాయపడగలదని అంచనా వేయబడుతోంది.
భీమ్ యాప్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించే విధానం:
- మీ భీమ్ యాప్ హోమ్ స్క్రీన్‌లో ఉన్న ‘రీచార్జెస్ అండ్ పే బిల్స్’ సెక్షన్‌లో ‘వ్యూ ఆల్’పై క్లిక్ చేయండి.
- ‘అదర్ కేటగిరీస్’ సెక్షన్ కింద ‘ఎన్‌పీఎస్’పై క్లిక్ చేసి, ఈ కింది వివరాలు ఎంటర్ చేయాలి:పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరు (PRAN) లేదా 10 అంకెల మొబైల్ నంబరు
- నియమ నిబంధనలను అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌ను టిక్ చేసి ‘గెట్ బిల్ డిటెయిల్స్’పై ట్యాప్ చేయండి.
- ‘బిల్ ఇన్ఫో’పై ట్యాప్ చేసి, ఎన్‌పీఎస్ పెట్టుబడి వివరాలను,చందా అమౌంటు బ్రేకప్‌ను రివ్యూ చేయండి.
- మీ ప్రాధాన్య చెల్లింపు విధానాన్ని ఎంచుకుని, ‘పే’ పై ట్యాప్ చేసి పేమెంట్‌ను పూర్తి చేయండి.
- పుట్టిన తేదీ
- శ్రేణి (Tier)
- చందా మొత్తం
ఈ ఫీచర్‌తో రిటైర్మెంట్ సేవింగ్స్ మరింత సులభంగా, అందుబాటులో ఉంటాయి.