డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, అక్టోబర్ 22, 2024: ఎంఎస్ఎంఈల వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన సీఎస్‌బీ బ్యాంక్ “ఎస్ఎంఈ టర్బో లోన్” అనే కొత్త రుణాన్ని ప్రకటించింది. ఈ సరళతరమైన రుణ సొల్యూషన్ ద్వారా, బ్యాంక్ వివిధ రంగాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు సత్వర, నిరాటంకమైన రుణాల ప్రాప్తిని అందించాలనుకుంటోంది.
ఎస్ఎంఈ టర్బో లోన్ ప్రత్యేకతలు:
- రుణాలు: రూ. 5 కోట్ల వరకు
- సదుపాయాలు: ఓవర్‌డ్రాఫ్ట్ (OD), టర్మ్ లోన్ (TL),ట్రేడ్ సదుపాయాలు
- తక్షణ మంజూరు: సూత్రప్రాయంగా
- రుణ ఆమోదం: సరళతరమైన స్కోర్‌కార్డ్ ఆధారంగా
ఈ కొత్త రుణ ఆఫర్ గురించి మాట్లాడుతూ, ఎస్ఎంఈ బిజినెస్ గ్రూప్ హెడ్ శ్యామ్ మణి అన్నారు, “ఈ బహుళ ఫీచర్లతో కూడిన ఉత్పత్తి, ఎంఎస్ఎంఈలు తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోవడానికి వేగవంతమైన, సులభమైన, పారదర్శకమైన క్రెడిట్ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. మార్కెట్లో ప్రత్యేకమైన ఈ టర్బో లోన్, సరళమైన రుణ మదింపు ప్రక్రియతో, తక్షణ సూత్రప్రాయ ఆమోదాన్ని అందిస్తుంది.
సంప్రదాయక రుణ ప్రక్రియలో ఉండే ప్రతిబంధకాలను తొలగించడం ద్వారా, మేము చిన్న వ్యాపారాల వేగవంతమైన వృద్ధికి సహాయపడడం కాకుండా, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నాం. ఈ స్కోర్‌కార్డ్ పరిశ్రమ నిపుణులతో కలిసి అభివృద్ధి చేయబడింది.”
ఈ ప్రోడక్ట్, నేటి డైనమిక్ వ్యాపార పరిసరాల్లో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం కోసం, సీఎస్‌బీ బ్యాంక్ “సస్టైయిన్, బిల్డ్, స్కేల్ 2030” లక్ష్యానికి అనుగుణంగా ఉంది.