
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్ 30 నవంబర్,2024: భారతీయ సంప్రదాయం, ఆధ్యాత్మికపరమైన ఉత్పత్తులలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన’ గిరి’ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ మల్కాజ్ గిరిలో సరికొత్త షోరూంను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటిస్తుంది.
ప్రామాణికమైన ఆధ్యాత్మిక వనరులు,సాంస్కృతిక అవసరాలను భారతదేశమంతటా విస్తరింప చేయడానికి ఈ కొత్త షోరూం అతి ముఖ్యమైన స్థానాన్ని వహిస్తుంది. ఆధ్యాత్మిక ,సాంస్కృతిక సంబంధాలను వ్యక్తిగత,కుటుంబ సమూహ పరముగా మెరుగుపరిచే విధంగా అధిక నాణ్యత,సాంప్రదాయ బద్ధమైన వస్తువులను అందించుటలో గిరి తమ నిబద్ధతను కొనసాగిస్తుంది.

అందుకుగాను మా సంస్థ మల్కాజ్గిరి షో రూమ్ లో ఆధ్యాత్మిక పుస్తకాలు పూజా సామాగ్రిలు సాంప్రదాయ వస్త్రములు భక్తి పాటలు ఇంకా మరెన్నో రకరకాల వస్తువులను అత్యున్నత నాణ్యత,ప్రామాణికత చెక్కుచెదరక అందించడమే తమ లక్ష్యంగా భావిస్తుంది.
ఎప్పుడూ సందడిగా ఉండే మల్కాజ్గిరిలో ప్రారంభింపబడిన ఈ షో రూము మల్కాజ్గిరి స్థానికులే కాక దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా ఎంతో ఇంపైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలోను, స్వాగత సత్కారాలలోను మీ మనసులను రంజింప చేస్తుంది.
దానివల్ల మిమ్మల్ని మా షో రూమ్ కు పదేపదే తీసుకువస్తుంది అనేదే మా నమ్మకము. అంతేకాదు మా షోరూంకు విచ్చేసే కస్టమర్లను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వారి కి అవసరమైన ఆధ్యాత్మిక ,సాంప్రదాయ వస్తువులను విస్తృతశ్రేణిలో అందించడాన్ని తమ లక్ష్యంగా భావిస్తుంది.

ఈ సందర్భంగా గిరి సంస్థ డైరెక్టర్ శారదా ప్రకాష్ “హైదరాబాదులో మా గిరి సంస్థను విస్తరించడం అనేది మాకు అత్యంత ఆనందాన్ని అందిస్తుంది అంతేకాక అధిక నాణ్యత గల ఆధ్యాత్మిక, సంప్రదాయ వనరులను హైదరాబాదు నివాసులు అతి సులభంగా పొందేందుకు అనుకూలమైన పరిస్థితులను అందించడమేకాక తమ ఊపిరిగాను భావిస్తుంది”.