డిజైనర్ హబ్ గా హైదరాబాద్: 3 ఫ్లాగ్‌షిప్ డిజైనర్ స్టోర్స్ ప్రారంభం..

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబరు 2024: ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డిజైనర్ హబ్ గా అవతరించింది. దానికి కారణం భారతదేశంలోనే ప్రముఖ డిజైనర్లుగా పేరుపొందిన రాహుల్ మిశ్రా, అబ్రహాం ఠాకూర్-సత్యపాల టీమ్ ఇక్కడ తమ ఫ్లాగ్ షిప్ స్టోర్స్ ని ప్రారంభించారు. ఇవి హైదరాబాద్ లోని సత్వా సిగ్నేచర్ టవర్ లో ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌ సరికొత్తగా పునర్నిర్వచించబడుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో లగ్జరీ రిటైల్ మరియు హై-ఎండ్ డిజైన్‌కు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుంది.

హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అందులోనూ వస్త్రాలపరంగా కూడా హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ నగరం గొప్ప సాంస్కృతిక వస్త్రాలతో నిండిన నగరం. కళాత్మకత, వస్త్రాలు, చేతిపనులు ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచాయి. ఈ నగరం శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వం మరియు సమకాలీన ఫ్యాషన్‌ రెండించి మిళితంగా ఉంటుంది. అందుకే భారతదేశంలోని ప్రముఖ డిజైనర్‌ ల క్రియేటివ్ విజన్ ను దర్శించడానికి ఇది సరైన వేదికగా మారుతుంది.

అత్యంత కష్టమైన హస్తకళకు వస్త్రాల వినూత్న వినియోగానికి ప్రసిద్ధి చెందిన రాహుల్ మిశ్రా తన స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆయనతో పాటు ప్రఖ్యాత అబ్రహం & ఠాకోర్ లేబుల్ వెనుక ఉన్న క్రియేటివ్ విజనరీస్ అయినటువంటి డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకోర్ కూడా తమ స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. డేవిడ్ అబ్రహాం, రాకేష్ ఠాకోర్ ని ముద్దుగా ‘మాస్టర్స్ ఆఫ్ మినిమలిజం’ అని పిలుస్తారు. వారు తమ క్రాఫ్ట్-ఆధారిత, సమకాలీన డిజైన్‌లను వినియోగదారులకు అందిస్తారు. మరోవైపు ఐకానిక్ చీరలు, సమకాలీన ఫ్యూజన్ దుస్తులకు ప్రసిద్ధి చెందారు సత్య పాల్. సత్య పాల్ చీరలు స్టోర్ లైనప్‌కు గ్లామర్, గ్రేస్‌ను జోడిస్తాయి.

సినీ సెలబ్రిటీలు అయునటువంటి శోభితా ధూళిపాళ్ల, తమన్నా భాటియా, సుధా రెడ్డి, నిహారిక కొణిదెల, పింకీ రెడ్డి ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇంతమంది ప్రముఖ సెలబ్రిటీలు హాజరైన దాన్ని బట్టి మనం గమనిస్తే..ఫ్యాషన్ ఇండస్ట్రీపై సెలబ్రిటీలకు ప్రజలకు ఉన్న ఇష్టాన్ని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.

సత్వ సిగ్నేచర్ టవర్‌లో ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్స్ ని ప్రారంభించారు. దీనిద్వారా ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ప్రముఖ ప్లేయర్ గా హైదరాబాద్ ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగుగా చెప్పవచ్చు.

editor daily mirror

Related Posts

Piramal Finance Partners with CSCs to Boost Credit Access for Bharat’s Underserved Regions

DailyMirror.news,New Delhi, September 16, 2024: Piramal Capital & Housing Finance Ltd. (Piramal Finance), a subsidiary of Piramal Enterprises Ltd., has joined forces with

ZEE5లో సెప్టెంబ‌ర్ 27న స్ట్రీమింగ్ కానున్న ‘డీమాంటే కాలనీ 2’

డైలీమిర్రర్ డాట్ న్యూస్, సెప్టెంబ‌ర్ 16, 2024:ZEE5, ఇండియాలో ప్రముఖమైన మరియు వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్

You Missed

Piramal Finance Partners with CSCs to Boost Credit Access for Bharat’s Underserved Regions

Piramal Finance Partners with CSCs to Boost Credit Access for Bharat’s Underserved Regions

ZEE5లో సెప్టెంబ‌ర్ 27న స్ట్రీమింగ్ కానున్న ‘డీమాంటే కాలనీ 2’

ZEE5లో సెప్టెంబ‌ర్ 27న స్ట్రీమింగ్ కానున్న ‘డీమాంటే కాలనీ 2’

ZEE5 Announces World Digital Premiere of the Year’s Scariest Blockbuster: ‘Demonte Colony 2’

ZEE5 Announces World Digital Premiere of the Year’s Scariest Blockbuster: ‘Demonte Colony 2’

24 గంట‌ల్లోనే 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో జోరు చూపిస్తోన్న మహానటి కీర్తి సురేష్ ‘రఘు తాత’

24 గంట‌ల్లోనే 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో జోరు చూపిస్తోన్న మహానటి కీర్తి సురేష్ ‘రఘు తాత’

Keerthy Suresh’s “Raghu Thatha” gets 50 million views on ZEE5 platform

Keerthy Suresh’s “Raghu Thatha” gets 50 million views on ZEE5 platform

జూబ్లీహిల్స్ లో మాన్ సూన్ ల‌గ్జ‌రీ సెలూన్ మొద‌టి శాఖ ప్రారంభం

  • By DMNadmin
  • September 16, 2024
  • 3 views
జూబ్లీహిల్స్ లో మాన్ సూన్ ల‌గ్జ‌రీ సెలూన్ మొద‌టి శాఖ ప్రారంభం