డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,అక్టోబర్ 25, 2024:భారతీయ రొయ్యల పరిశ్రమ E.H.P- ఎంటెరోసైటోజోన్ హెపటోపీనాయి (Enterocytozoon hepatopenaei) పరాన్నజీవి వలన పెరుగుతున్న ముప్పుతో పోరాడుతున్నప్పుడు, కెమిన్ సంస్థ సమర్థవంతమైన వ్యాధి నిర్వహణ, పరిష్కారాల అవసరాన్ని వివరించింది. E.H.P, ఒక మైక్రోస్పోరిడియన్ పరాన్నజీవి, రొయ్యల ఆరోగ్యాన్ని,రొయ్యల చెరువులని ప్రభావితం చేస్తూ తీవ్రమైన ఆర్థిక నష్టాలకు మూల హేతువుగా ఉంది.
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ప్రకారం, భారతీయ రొయ్యల సాగులో వ్యాధి సంభవించే అవకాశం 49% ఉంది. ఈ గణాంకాలు E.H.P వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఆక్వాకల్చర్ సాంకేతిక నిపుణుల సలహాల మేరకు సమర్థవంతమైన వ్యూహాలను అమలు పరచాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. E.H.P కారణంగా వార్షికంగా ఆర్థిక నష్టాలు ₹4,000 కోట్ల కంటే ఎక్కువని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. భారతదేశ రొయ్యల పరిశ్రమ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 73% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటం వల్ల మన రాష్ట్రం ఈ E.H.P, వినాశకరమైన ప్రభావాలను విస్తృతంగా ఎదుర్కొంటుంది. E.H.P వ్యాధి బారిన పడిన చెరువులనే కాకుండా రొయ్యల పరిశ్రమకు సమూలంగా హాని చేకూరుస్తూ గ్రామీణ ,పట్టణ సమాజాల్లో జీవనోపాధులను సైతం ప్రభావితం చేస్తుంది.
“ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, కెమిన్ Pathorol™ను ఆవిష్కరించింది. ఇది E.H.P వ్యాధిని సమర్థవంతంగా తగ్గించడానికి,రొయ్యల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక వినూత్న పరిష్కారం. మా శాస్త్రీయ పరిశోధన,ప్రాక్టికల్ అప్లికేషన్ల మద్దతుతో బహుళ ప్రయోజనాలు గల ఫైటోజెనిక్ ఆధారిత Pathorol™ ఉత్పత్తిని అందజేయగలుగుతున్నాము.
E.H.P ప్రభావాన్ని తగ్గించడం.రొయ్యల హేపటోపాంక్రియాస్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, Pathorol™ సెకండరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తూ రొయ్య రైతుల గరిష్ట ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంపొందిస్తుందని”కెమిన్ గ్లోబల్ రీసెర్చ్ & డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాజలక్ష్మి వ్యాఖ్యానించారు.
కెమిన్ కమర్షియల్ డైరెక్టర్ డాక్టర్ సి. సుగుమార్ Pathorol™ ఒక మార్గదర్శక పరిష్కారమనీ, రొయ్యల,సంపూర్ణమైన ఆరోగ్యాన్ని రక్షించడానికి నిరూపితమైందనీ, నిర్దిష్టమైన యాజమాన్య పద్ధతులూ, బయో సెక్యూరిటీ చర్యలను అవలంబిస్తూ Pathorol™ను వాడడం ద్వారా రొయ్య రైతుల లాభాలు హెచ్చిస్తాయని పేర్కొన్నారు.
Pathorol™ ప్రపంచవ్యాప్తంగా తన సమర్థతను నిరూపించి, 20 కంటే ఎక్కువ విజయవంతమైన కేస్ స్టడీలలో E.H.P నిర్వహణ,చెరువుల ఉత్పాదకతలో మెరుగుదలను చూపిస్తుందని కెమిన్ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ గ్రిన్ స్వాంగ్డాచారుక్ వివరిస్తూ Pathorol™ ,ఆర్థిక ప్రయోజనాలు పొందుపరిచారు. Pathorol™ను ఉపయోగిస్తున్న రొయ్య రైతులు EHP ను సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారని , తద్వారా పంట నష్టాన్ని తగ్గించి కనీసం 5 నుండి 20% వరకు దిగుబడిలో పెరుగుదలను పొందినట్లు వ్యాఖ్యానించారు.
కెమిన్ సంస్థ ద్వారా E.H.P వ్యాధి నివారణ, Pathorol™ పనితీరుపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణ, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల రొయ్యల చెరువులలో విస్తృతంగా జరిపిన పరిశోధన ఫలితాలనూ, రైతుల అనుభవాలనూ రీజియనల్ టెక్నికల్ మేనేజర్ డాక్టర్ వివేకానంద విశదీకరించారు.
కెమిన్ E.H.P వ్యాధి నివారణకు ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో సహాయపడటానికి టెక్నికల్ టీం, కస్టమర్ లేబరేటరీ సర్వీసెస్ సేవలను రొయ్య రైతులకు అందిస్తుందని కెమిన్ రీజినల్ డైరెక్టర్ కృష్ణన్ వివరించారు. వ్యాధి నివారణ పై సరైన పరిజ్ఞానం ద్వారా, మనం కలసి EHP ను ఎదుర్కొని, లాభదాయకతను, స్థిరమైన వృద్ధుని పొందవచ్చునని అభిప్రాయపడ్డారు.
మన దేశ ఆర్థిక వ్యవస్థలో రొయ్యల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా, కెమిన్ రొయ్యల ఉత్పత్తిదారులకు లాభదాయకంగా రొయ్యలను పెంచడంలో సహాయపడే సమర్థవంతమైన శాస్త్రీయ పరిష్కారాలను అందించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
కెమిన్ సంస్థ. (www.kemin.com) ఆహార ఉత్పత్తి రంగంలో పరిశోధనాత్మకమైన శాస్త్రీయ ఆవిష్కరణలలో ప్రత్యేకమైన ముడి సరుకుల వ్యుత్పత్తి రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ. 1961లో స్థాపించబడిన కెమిన్, తన ఉత్పత్తులు,సేవల ద్వారా ప్రపంచ జనాభాలో 80% మందికి జీవన నాణ్యతను స్థిరంగా మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. కెమిన్ ఆక్వాసైన్స్™ ఆక్వా పరిశ్రమలో వినూత్న పరిష్కారాలను అందించడంపై దృష్టి సారిస్తుంది. శాస్త్రీయంగా ఆవిష్కరింపబడ్డ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుతమైన ఆక్వా సాగు పద్ధతులకు కెమిన్ సంస్థ ఎల్లప్పుడూ తన వంతు మద్దతునిస్తుంది.