డైలీ మిర్రర్ డాట్ న్యూస్, ముంబై,సెప్టెంబర్ 4,2024:వెల్త్ మేనేజర్లు, ఫ్యామిలీ ఆఫీసులు, బ్యాంకులు, ఎక్స్‌టర్నల్ అసెట్ మేనేజర్ల అవసరాలను తీర్చే విధంగా రూపొందించిన అధునాతన, ఆమ్నిచానెల్, వెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ‘ఎంపవర్ వెల్త్’ ప్లాట్‌ఫాంను కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) ఆవిష్కరించింది. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడంలో వెల్త్ మేనేజర్లకు తోడ్పడేలా ఇది ఫ్రంట్, మిడ్, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలను ఇంటిగ్రేట్ చేయడంతో పాటు మల్టీ-అసెట్, మల్టీ-కరెన్సీ సామర్ధ్యాలు, టెక్నాలజీ తోడ్పాటును అందిస్తుంది.

నైట్ ఫ్రాంక్ నివేదిక 2024 ప్రకారం అంతర్జాతీయంగా వెల్త్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. అల్ట్రా-హై-నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య 2023లో 4.2% పెరిగి 6,26,619కి చేరుకుంది. వచ్చే అయిదేళ్లలో ఇది 28.1% వృద్ధి చెందుతుందని, భారత్,మెయిన్‌ల్యాండ్ చైనా వంటి ప్రాంతాలు వరుసగా 50%,47% వృద్ధి చెందగలవని అంచనాలు ఉన్నాయి.

మల్టీ-అసెట్, మల్టీ-కరెన్సీల్లో పెట్టుబడుల ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల అసెట్లకు సంబంధించి సమగ్రమైన వీక్షణను అందిస్తూ, నియంత్రణ సంస్థలపరమైన నిబంధనలను పాటిస్తూ, వ్యాపారాల వృద్ధితో పాటే విస్తరించుకోగలిగే సామర్ధ్యాలు ఉండే ప్లాట్‌ఫాంలకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. సమగ్రమైన, విస్తరించతగిన, సాంకేతికంగా అధునాతమైన ప్లాట్‌ఫాంను అందించడం ద్వారా ఈ వర్ధమాన మార్కెట్ అవసరాలను తీర్చాలనేది ఎంపవర్ వెల్త్ లక్ష్యం.

“భారతీయ టెక్నాలజీ రంగం అంతర్జాతీయ ఫైనాన్స్ రంగానికి కీలక సేవలు అందిస్తోంది. ఎంపవర్ వెల్త్ ద్వారా మేము ఈ పరివర్తనలో భాగమవుతున్నాం. సంక్లిష్టత గణనీయంగా పెరుగుతున్న ఈ విభాగంలో వెల్త్ మేనేజర్లు ముందుకు పురోగమించేందుకు ఆర్థికరంగంలో అనుభవంతో పాటు సాంకేతిక ఆవిష్కరణల మేళవించి మేము తోడ్పాటు అందిస్తున్నాం. ఎంపవర్ వెల్త్‌తో ఫిన్‌టెక్ పరిణామక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశంతో పాటు మేము కూడా పాలుపంచుకుంటున్నాం” అని కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ మరియు సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు.

ఎంపవర్ వెల్త్ ప్రధాన ఫీచర్లు:

·         సమగ్ర అనుసంధానత: వర్క్‌ఫ్లో నిర్వహణను మెరుగుపర్చుకునేలా ఫ్రంట్, మిడ్, బ్యాంక్ ఆఫీస్ కార్యకలాపాల అనుసంధానం

·         మల్టీ-అసెట్, మల్టీ-కరెన్సీ సామర్థ్యాలు: వివిధ అసెట్ సాధనాలు, కరెన్సీలవ్యాప్తంగా వైవిధ్యమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలను హ్యాండిల్ చేసే సామర్థ్యాలు

·         అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్: మరింత లోతైన విశ్లేషణలను అందించేందుకు ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వినియోగం

·         వ్యక్తిగతీకరణ: విజువలైజేషన్,ఏఐ ఆధారిత విశ్లేషణల ద్వారా క్లయింట్లకు అనుగుణమైన సేవలు

·         నియంత్రణ సంస్థల నిబంధనల పాటింపు: ఎప్పటికప్పుడు మారుతున్న నియంత్రణ సంస్థలపరమైన నిబంధనలను పాటించడంలో మద్దతునిచ్చే విధంగా బిల్ట్-ఇన్ ఫీచర్లు

·         స్కేలబిలిటీ: అన్ని స్థాయుల వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలకు తగ్గ పనితీరును అందిస్తూ వ్యాపార వృద్ధితో పాటు విస్తరించుకునే విధంగా డిజైన్ చేయబడింది

·         360- డిగ్రీ క్లయింట్ వ్యూ: క్లయింట్ల ఆర్థికాంశాలపై సమగ్ర అవగాహన

·         కాన్ఫిగరబిలిటీ: వివిధ వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ మోడల్స్ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించుకునేందుకు అనువైనది.