
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, మే10, 2025: అమ్మ.. ఈ పదంలోనే ఆలనా, ఆప్యాయత, అనురాగం కనిపిస్తాయి. అలాంటి అమ్మ విలువను, గొప్పతనాన్ని చాటేందుకు సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌గా రూపొందిన చిత్రం ‘అమ్మ’. ఏఏఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్.. మదర్స్ డే సందర్భంగా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి ‘అమ్మ’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇంద్రాణి గతంలో నటించిన “అందెల రవమిది” చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
తాజాగా ‘అమ్మ’ షార్ట్ ఫిల్మ్‌లోనూ కీలక పాత్రలో నటించిన ఇంద్రాణి మాట్లాడుతూ, “అమ్మ అనేది నిస్వార్థ ప్రేమకు ప్రతీక. ఏమీ ఆశించని అమ్మ ప్రేమను, ఆమె త్యాగాన్ని ఈ చిత్రం ద్వారా చూపించాం. ఈ కథ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందని నమ్ముతున్నాను,” అని అన్నారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “మనకు కష్టం వస్తే కన్నీటితో కంటినీరు కార్చే అమ్మకు మనం బాధ కలిగిస్తే ఆమె ఎంతటి ఆవేదన పడుతుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపే అమ్మకు మనం ఏం ఇవ్వగలం? ఈ ప్రశ్నల చుట్టూ మా చిత్రం తిరుగుతుంది,” అని వివరించారు.
This is also Read.. Financial Results for the Year Ended March 31, 2025
This is also Read.. Quotes from the Industry leaders for the National Technology Day 2025
ఈ చిత్రంలో ఇంద్రాణి దవలూరితో పాటు సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు నటించారు. సంగీతం కె.వి. భరద్వాజ్ సమకూర్చగా, కార్తీక్ కళ్లూరి సినిమాటోగ్రఫీ అందించారు.
అమ్మ త్యాగాన్ని, ప్రేమను తెలియజేసే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల హృదయాలను తాకడం ఖాయం అని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ‘అమ్మ’ చిత్రం విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- బ్యానర్: ఏఏఆర్ ఫిల్మ్ మేకర్స్
- టైటిల్: అమ్మ
- నటీనటులు: ఇంద్రాణి దవలూరి, సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్ బన్నాయ్
- సంగీతం: కె.వి. భరద్వాజ్
- కెమెరా: కార్తీక్ కళ్లూరి
- పీఆర్వోలు: అశోక్ దయ్యాల, కడలి రాంబాబు