 
									డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 18, 2025: ప్రేమ, విరహం వంటి సున్నితమైన భావోద్వేగాలతో యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అద్భుతమైన తెలుగు ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ “నీవే నా తొలి ప్రేమ” హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కృతమైంది.
‘లవ్ అండ్ బ్రేకప్’ థీమ్‌తో హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించిన ఈ ఆల్బమ్ పాటలను ప్రముఖ దర్శకుడు, తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, అలాగే ప్రముఖ సినీ సంగీత దర్శకులు భోలే షావాలి వేర్వేరుగా విడుదల చేశారు.
ఉన్నతమైన క్వాలిటీతో ఆల్బమ్..
ఈ సందర్భంగా డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ.. “వెన్ ల్యాక్స్ టీమ్ చాలా క్వాలిటీగా వర్క్ చేసింది. పెద్ద సినిమాల్లో పాటల మాదిరిగానే ఎంతో నాణ్యతతో ఈ ఆల్బమ్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా, ఈ పాటలు యువతతోపాటు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి” అని ప్రశంసించారు.

సంగీత దర్శకులు భోలే షావాలి మాట్లాడుతూ.. “యూత్‌కు కనెక్ట్ అయ్యే మంచి మ్యూజిక్, ఎమోషనల్ కంటెంట్‌తో ఈ ఆల్బమ్ రూపొందడం ఆనందకరం.
ఈ పాటల్లో బలమైన లవ్ స్టోరీ ఫీల్ ఉంది. వెన్ ల్యాక్స్ ప్రొడక్షన్స్ (VenLax Productions) వెన్ ల్యాక్స్ మ్యూజిక్స్ పతాకంపై నిర్మించిన ఈ పాటలు ప్రేక్షకులను తప్పక అలరిస్తాయి. యువ ప్రతిభను ప్రోత్సహించిన నిర్మాతలకు, దర్శకుడికి నా అభినందనలు,” అని తెలిపారు.
ముఖ్యపాత్రల్లో యంగ్ టాలెంట్..
ఈ ఆల్బమ్‌లో యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు హరీష్ దాచేపల్లి, సాయి నీరజ ప్రధాన పాత్రలు పోషించగా, జగదీష్ కీలక పాత్రలో నటించారు. లవర్ పాత్రలో హరీష్ దాచేపల్లి నటన, భావోద్వేగాలను పలికించిన తీరు ఎంతో సహజంగా ఉందంటూ యూనిట్ సభ్యులు కొనియాడారు.
సాంకేతిక నిపుణుల కృషి..
ఈ ఆల్బమ్‌కు ప్రముఖ సినీ దర్శకుడు తాజుద్దీన్ దర్శకత్వం వహించడంతో పాటు, పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సమర సింహ అందించిన సినిమాటోగ్రఫీ పాటల విజువల్స్‌ను మరింత గ్రాండ్‌గా, ఎక్సలెంట్‌గా మార్చింది.
ఎడిటింగ్, డీఐ బాధ్యతలను జగదీష్ కుమార్ నిర్వహించగా, ప్రశాంత్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నరేష్, సందీప్ వంటి ఇతర సాంకేతిక నిపుణుల కృషి కూడా ఆల్బమ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
మేకర్స్ ధీమా..
వెన్ ల్యాక్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ “నీవే నా తొలి ప్రేమ” మ్యూజికల్ ఆల్బమ్ నేటి తరం యువ ప్రేక్షకులను, ముఖ్యంగా విఫలమైన ప్రేమ కథలున్న వారిని, తమ కథగా భావించేలా చేస్తుందని, తద్వారా ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే ఈ పాటలు అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయని వెన్ ల్యాక్స్ ప్రొడక్షన్స్ అధినేత దాచేపల్లి హరీష్ తెలిపారు. ఈ పాటలను రీల్స్ కోసం ‘నీవే నా తొలి ప్రేమ’ (Neeve Naa Tholi Prema – Her Silence-Female Version) పేరుతో సెర్చ్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.


 
					 
																			