
డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2024: న్యూఢిల్లీకి చెందిన మాన్ సూన్ లగ్జరీ సెలూన్, హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో తన మొదటి శాఖను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ‘హనుమాన్’ సినిమాతో ప్రముఖుడైన హీరో తేజ సజ్జా పాల్గొన్నారు.
మాన్ సూన్ సెలూన్ ఈ నెలంతా అన్ని బ్యూటీ సర్వీసులపై 30% డిస్కౌంట్ అందిస్తోంది. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృతమైన సౌందర్య సేవలను అందించనున్న ఈ సెలూన్, కెరాస్టాస్ ఉత్పత్తులతో సహా, అత్యున్నత స్థాయి ఉత్పత్తులను ఉపయోగించి నిపుణులు సేవలను అందిస్తారు.

ప్రత్యేక సదుపాయాలు:
ప్రత్యేక సభ్యత్వాల ద్వారా అదనపు ప్రయోజనాలు
అద్భుతమైన పార్కింగ్ సౌకర్యం
విశాలమైన, సౌకర్యవంతమైన వాతావరణం
ఈ ప్రారంభోత్సవంలో మాన్ సూన్ సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ శుభి జొహారీ, టెర్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ అర్జున్ గుండవరం తదితరులు పాల్గొన్నారు. నమకా ఎంటర్ ప్రైజెస్ ఎండీ, మాన్ సూన్ సెలూన్ ఫ్రాంచైజీ యజమాని అభిషేక్ గుండవరం మాట్లాడుతూ, “మాన్ సూన్ సెలూన్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నగరానికి అనుగుణంగా సరికొత్త అనుభవాన్ని అందించడానికి, కొత్త ప్రమాణాలను అందిస్తున్నాం” అని తెలిపారు.
కొత్త సెలూన్ ఆధునిక డిజైన్ , అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను అందిస్తూ, వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడానికిమాన్ సూన్ సెలూన్ కట్టుబడి ఉందని నిర్వాహకులు వెల్లడించారు.
