
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, అక్టోబర్10, 2025: టాటా అసెట్ మేనేజ్‌మెంట్, ఈక్వల్-వన్‌మనీతో కలిసి, టాటా మ్యూచువల్ ఫండ్ యాప్‌లో పోర్ట్‌ఫోలియో 360 అనే పరిశ్రమలో మొదటి సారి పరిచయం చేయబడిన ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఇన్వెస్టర్లకు వారి మొత్తం ఆర్థిక పోర్ట్‌ఫోలియోను పారదర్శకంగా, సమగ్రంగా మరియు చర్యాత్మకంగా చూసే అవకాశాన్ని అందిస్తుంది.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో ప్రదర్శించబడిన పోర్ట్‌ఫోలియో 360, ఇన్వెస్టర్లను కేంద్రంగా ఉంచి, సమగ్ర ఆర్థిక విశ్లేషణలు మరియు ప్రణాళికల కోసం ఒకే వేదికను అందిస్తుంది.
ప్రతీత్ భోబె, సీఈవో & ఎండీ, టాటా అసెట్ మేనేజ్‌మెంట్ మాట్లాడుతూ, “టాటా అసెట్ మేనేజ్‌మెంట్‌లో, పారదర్శకత మరియు సరళత్వం ద్వారా ఇన్వెస్టర్లను సాధికారత కల్పించడం మా నమ్మకం. పోర్ట్‌ఫోలియో 360 ఇన్వెస్టర్లకు వారి సంపద గురించి స్పష్టమైన, ఏకీకృత దృశ్యాన్ని అందిస్తుంది, తద్వారా వారు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇన్వెస్టింగ్‌ను సరళీకరించడం,ఆర్థిక ప్రణాళికను మరింత డేటా ఆధారితంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి,” అని అన్నారు.

పోర్ట్‌ఫోలియో 360 ప్రధాన లక్షణాలు:
- సులభమైన ఆన్‌బోర్డింగ్: ఇన్వెస్టర్లు కేవలం కొన్ని క్లిక్‌లతో బహుళ వనరుల నుంచి ఆర్థిక డేటాను సురక్షితంగా సేకరించవచ్చు, పారదర్శక సమ్మతి నిర్వహణ ద్వారా పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు.
- ఏకీకృత ఆర్థిక డ్యాష్‌బోర్డ్: బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్‌లు, ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు మరియు ఇతర ఆస్తుల నికర విలువను ఒకే చోట సమగ్రంగా చూడవచ్చు.
- స్మార్ట్ పోర్ట్‌ఫోలియో విశ్లేషణలు: ఈక్వల్-వన్‌మనీ అనలిటిక్స్ ఆధారిత ట్రెండ్ గ్రాఫ్‌లు, హోల్డింగ్స్ సారాంశం, మరియు FIRE (ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ) కాల్‌క్యులేటర్ వంటి వ్యక్తిగతీకరించిన సాధనాలు రియల్-టైమ్ డేటాతో రిటైర్మెంట్ ,ఆర్థిక స్వాతంత్ర్య ప్రణాళికలకు సహాయపడతాయి.
టాటా మ్యూచువల్ ఫండ్ యాప్ ఆవిష్కరణ తర్వాత కొద్ది నెలల్లోనే 6 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు సాధించి, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందింది.
కృష్ణ ప్రసాద్, ఫౌండర్ & సీఈవో, ఈక్వల్-వన్‌మనీ మాట్లాడుతూ, “టాటా అసెట్ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం ద్వారా అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ శక్తిని ఇన్వెస్టర్లకు అందించడం మాకు ఆనందకరం. డేటా గోప్యత, భద్రత అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తూ, ప్రతి భారతీయునికి ఆర్థిక అవగాహన, ప్రణాళిక, స్వాతంత్ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం పోర్ట్‌ఫోలియో 360 ఒక కీలక దశ,” అని తెలిపారు.
టాటా మ్యూచువల్ ఫండ్ యాప్ బలమైన సామర్థ్యాలను ఈక్వల్-వన్‌మనీ యొక్క అకౌంట్ అగ్రిగేటర్ నైపుణ్యంతో కలపడం ద్వారా, పోర్ట్‌ఫోలియో 360 డిజిటల్ ఇన్వెస్టర్ సొల్యూషన్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పారదర్శకత, ఆవిష్కరణ,డేటా ఆధారిత విశ్లేషణలను మిళితం చేస్తూ, ఇన్వెస్టర్లు ఆత్మవిశ్వాసంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతోంది.

ఈ వ్యాసంలో వ్యక్తం చేయబడిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి మరియు మార్కెట్‌ను అంచనా వేయడానికి లేదా సమయం ఊహించడానికి ఉద్దేశించినవి కావు. ఈ వివరాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే,ఇది ఏ విధమైన పెట్టుబడి, చట్టపరమైన లేదా పన్ను సలహాగా పరిగణించబడదు. ఈ సమాచారం ఆధారంగా మీరు తీసుకునే ఏ చర్యలకైనా మీరే బాధ్యత వహిస్తారు, టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాని పరిణామాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
పెట్టుబడి పెట్టే ముందు మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించండి. ఈ వ్యాసంలో వ్యక్తం చేయబడిన అభిప్రాయాలు టాటా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పోర్ట్‌ఫోలియోలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ అభిప్రాయాలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.అవి మార్పుకు లోబడి ఉంటాయి.
టాటా మ్యూచువల్ ఫండ్ యొక్క ఏ స్కీమ్ కిందా హామీ లేదా హామీ రాబడి ఉండదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి, అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి.