డైలీ మిర్రర్ డాట్ న్యూస్,గుంతకల్ , నవంబర్ 26, 2025: ఆహార ,కిరాణా చైన్ అయిన మోర్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ మానిప్యులేషన్, మోసం చేయటం ,స్టోర్ లోని వస్తువులను దొంగతనం చేయటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను కనుగొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్, నెల్లూరు,కర్నూలులోని తమ స్టోర్ ఉద్యోగులలో కొంతమందిపై కఠినమైన చర్యలు ప్రారంభించింది.
అంతర్గత స్టాక్ ఆడిట్, ధృవీకరణ సమయంలో ఈ ఉల్లంఘనలను మోర్ రిటైల్ ఆడిట్ బృందం గుర్తించింది. ఉద్యోగులు పుట్టంరెడ్డి వెంకట నరసారెడ్డి, నర్రా శేఖర్, రవి కుమార్ మీనుగ,పదం జ్యోతిశ్వర రావు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది.

దొంగతనం, మోసం,నేరపూరిత నమ్మక ద్రోహానికి సంబంధించి ఈ వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (2003) సంబంధిత నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదులు చేయటం జరిగింది. ఈ సంఘటనలు గుంతకల్‌లోని కసాపురం రోడ్,నెల్లూరులోని వేదాయపాలెం ,ర్నూలులోని దుకాణాలలో జరిగాయి.
మోర్ రిటైల్ బృందం సంబంధిత పోలీస్ స్టేషన్లలో అధికారికంగా ఫిర్యాదులు చేసింది. పోలీసు అధికారులు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
సమగ్రత,కార్పొరేట్ పాలన పట్ల తమ దృఢమైన నిబద్ధతను మోర్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పునరుద్ఘాటించింది. కస్టమర్ నమ్మకాన్ని కాపాడుకోవటానికి, కంపెనీ ఆస్తులను రక్షించటానికి బలమైన దిద్దుబాటు చర్యలను తీసుకోవడం కొనసాగిస్తామని కంపెనీ నొక్కి చెప్పింది.

