డైలీ మిర్రర్ డాట్ న్యూస్, న్యూఢిల్లీ, మార్చి27, 2026: ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రిటైల్ ఆభరణాల గ్రూప్, బాధ్యతాయుతమైన ఆభరణాల బ్రాండ్ అయిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమక్షంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమ రూ. 200 కోట్ల విలువైన సీఎస్ఆర్ కార్యక్రమాలను ఈరోజు వెల్లడించింది.

ఈ సీఎస్ఆర్ కార్యక్రమంలో, భారతదేశవ్యాప్తంగా 33,000 మంది విద్యార్థినిలకు విద్యా స్కాలర్‌షిప్‌ల పంపిణీని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి. అహ్మద్, మేనేజింగ్ డైరెక్టర్ – ఇండియా ఆపరేషన్స్ ఓ. ఆషర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నిషాద్ ఎ.కె. , అబ్దుల్లా ఇబ్రహీం, కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్ పునీత్ కుమార్, ఐఏఎస్, ప్రథమ్ సీఈఓ శ్రీమతి రుక్మిణి బానర్జీ, మరియు థానల్ చైర్మన్ డాక్టర్ ఇద్రిస్ తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి..దేశంలోనే తొలిసారి ‘స్మార్ట్ సింక్’ టెక్నాలజీ : గోద్రెజ్ నుంచి ‘స్మార్ట్’ ఏసీలు విడుదల

ఇదీ చదవండి..తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక.. శాఖమూరులో ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ సిద్ధం..!

ఇదీ చదవండి..భారత ఆరోగ్య రంగంలో భారీ విలీనం: ఆస్టర్ – క్యుసిఐఎల్ (QCIL) కలయికకు వాటాదారుల పచ్చజెండా..

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశపు ఆడబిడ్డలకు సాధికారత కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా, మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆయనే మాట్లాడుతూ సీఎస్ఆర్ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలన్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిర్ణయం దేశ ప్రగతిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. భారతదేశ వృద్ధి ప్రజల, ముఖ్యంగా మహిళలు మరియు బాలికల సాధికారతలో మిళితమై ఉందని ఆయన నొక్కిచెప్పారు; విద్య ద్వారా అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో మలబార్ సంస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

విద్యార్థులు, యువత పెద్ద కలలు కనాలని, పరిమితులను అధిగమించి ఉన్నత ఆశయాలను ఏర్పరుచుకోవాలని, భారతదేశం అందిస్తున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు. దేశ వృద్ధి గాథకు చురుకుగా తోడ్పాటునందించాలని ఆయన కోరారు.

” జాతీయ వృద్ధికి వెన్నెముకగా మానవ వనరుల అభివృద్ధి నిలుస్తుంది” అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ చెప్పారు. “నాణ్యమైన విద్య ద్వారా ప్రతిభను పెంపొందించడం అత్యవసరం. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం విద్యార్థులకు విద్యాపరంగా విజయం సాధించి, దేశాభివృద్ధికి తోడ్పడేలా చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. “గణనీయమైన రీతిలో సీఎస్ఆర్ పెట్టుబడుల ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక సామాజిక ప్రభావాన్ని సృష్టించడానికి మా గ్రూప్ కట్టుబడి ఉంది” అని ఆయన వెల్లడించారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో, 15 ప్రధాన కార్యక్రమాల పరిధిలో, 19 రాష్ట్రాల్లోని 3,000కు పైగా ప్రాంతాలలో రూ. 200 కోట్ల విలువైన సీఎస్ఆర్ ప్రాజెక్టులు అమలు చేయబడతాయి. ఈ కార్యక్రమాల ద్వారా 2 లక్షల మందికి పైగా ప్రయోజనం పొందుతారని అంచనా.

వీధి బాలల కోసం మైక్రో-లెర్నింగ్ సెంటర్లు ,బాలికల కోసం జాతీయ స్కాలర్‌షిప్ కార్యక్రమాల వంటి వాటికి రూ. 114 కోట్లు కేటాయించడంతో విద్యపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆకలి రహిత ప్రపంచం ప్రాజెక్ట్ కింద ఆహార పంపిణీకి రూ. 30 కోట్లు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు రూ. 14.2 కోట్లు కేటాయించారు. నిరాధార తల్లుల కోసం ఉద్దేశించిన ‘గ్రాండ్ మా హోమ్’ కార్యక్రమంతో సహా గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రూ. 25 కోట్లు అందనున్నాయి. అదనంగా, ఇతర మానవతా కార్యకలాపాలకు రూ. 6.8 కోట్లు, పర్యావరణ పరిరక్షణకు రూ. 10 కోట్లు కేటాయించనున్నారు.

మలబార్ గ్రూప్ 33వ వార్షికోత్సవంలో భాగంగా, ఈ ఏడాది 18 రాష్ట్రాల్లోని 284 జిల్లాలకు చెందిన 33,000 మంది బాలికా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి 1,15,000 మందికి పైగా బాలికలు లబ్ధి పొందారు. అన్ని సీఎస్ఆర్ కార్యక్రమాలు మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడతాయి.

వీధి బాలల పునరావాసం కోసం, భారతదేశంలోని అతిపెద్ద ఎన్జీఓలలో ఒకటైన ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో మలబార్ గోల్డ్ & డైమండ్స్ 17 రాష్ట్రాల్లో 1,543 మైక్రో-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం కేంద్రాల సంఖ్యను 2,500కు పెంచనున్నారు, దీనితో విద్యార్థుల నమోదు ప్రస్తుతం ఉన్న 64,000 నుండి 1 లక్షకు పెరుగుతుందని అంచనా.

‘హంగర్ ఫ్రీ వరల్డ్’ ప్రాజెక్ట్ కింద, భారతదేశం, జాంబియా ,ఇథియోపియా వ్యాప్తంగా 1,15,000 మందికి ప్రతిరోజూ పౌష్టికరమైన భోజనం అందిస్తున్నారు. ఇతర సీఎస్ఆర్ కార్యక్రమాలలో నిరాధార మహిళలకు ఉచిత వసతి, సంరక్షణను అందించే ‘గ్రాండ్‌మా హోమ్’ ప్రాజెక్ట్, మరియు నిరుపేదలకు రాయితీ ధరలకు మందులను అందించే మలబార్-థనాల్ ఫార్మసీలు ఉన్నాయి.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ కార్యకలాపాలు ఈఎస్ జి సూత్రాలచే మార్గనిర్దేశం చేయబడతాయి. కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుండి, ఈ కంపెనీ తమ నికర వాణిజ్య లాభంలో 5% సీఎస్ఆర్ కార్యకలాపాలకు కేటాయిస్తోంది. ప్రథమ్ ,థనాల్ వంటి ఎన్ జి ఓ ల సహకారంతో ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, ఆరోగ్య సంరక్షణ, విద్య ,పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తాయి.

ఈ ప్రయత్నాలు ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా ప్రజల జీవితాలలో సానుకూల మార్పును తీసుకువచ్చాయి.