డైలీ మిర్రర్ డాట్ న్యూస్,జనవరి 31, 2025: యూటీఐ మ్యుచువల్ ఫండ్ నుంచి రెండు కొత్త ఇండెక్స్ ఫండ్స్- మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 & ఇండియా మాన్యుఫాక్చరింగ్

యూటీఐ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఇండెక్స్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. ఇవి మార్కెట్‌లో వినూత్నమైన అవకాశాలను అందించేందుకు రూపొందించబడ్డాయి.

1. యూటీఐ నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్

ఈ ఫండ్ దేశంలోనే తొలి మల్టీ-క్యాప్ ,మల్టీ-ఫ్యాక్టర్ ఇండెక్స్ ఫండ్‌గా ప్రారంభమైంది. ఇది నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 టీఆర్ఐను అనుసరించి పనిచేస్తుంది. మిడ్-స్మాల్ క్యాప్ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయబడింది.

NFO కాలవ్యవధి: 2025 జనవరి 28 – ఫిబ్రవరి 10
ఫండ్ మేనేజర్: శర్వణ్ కుమార్ గోయల్
బెంచ్‌మార్క్: నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 టీఆర్ఐ
కనీస పెట్టుబడి: రూ. 1,000 (తదుపరి పెట్టుబడులు రూ. 1 గుణితాల్లో)
లోడ్ స్వరూపం: ఎంట్రీ లేదా ఎగ్జిట్ లోడ్ లేదు

2. యూటీఐ నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఫండ్

భారతదేశ తయారీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఫండ్, నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ టీఆర్ఐను అనుసరించే ఓపెన్ ఎండెడ్ స్కీమ్. దేశీయంగా పెరుగుతున్న మాన్యుఫాక్చరింగ్ రంగంలోని పెట్టుబడిదారులకు ఇది ఉత్తమమైన అవకాశం.

NFO కాలవ్యవధి: 2025 జనవరి 28 – ఫిబ్రవరి 10
ఫండ్ మేనేజర్: శర్వణ్ కుమార్ గోయల్
బెంచ్‌మార్క్: నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ టీఆర్ఐ
కనీస పెట్టుబడి: రూ. 1,000 (తదుపరి పెట్టుబడులు రూ. 1 గుణితాల్లో)
లోడ్ స్వరూపం: ఎంట్రీ లేదా ఎగ్జిట్ లోడ్ లేదు

యూటీఐ ఏఎంసీ వ్యాఖ్య

“దశాబ్దాల అనుభవంతో, ప్యాసివ్ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఒక ప్రముఖ సంస్థగా మేం కొనసాగుతున్నాం. మార్కెట్‌లో వినూత్నమైన అవకాశాలు కల్పించేలా ఈ రెండు కొత్త ఫండ్స్‌ను ప్రారంభించాం. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఇవి సహాయపడతాయి” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వణ్ కుమార్ గోయల్ పేర్కొన్నారు.

యూటీఐ నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్

(నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 టీఆర్ఐని ప్రతిఫలించే/ట్రాక్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీమ్)

ఈ కింది లక్ష్యాలు గల ఇన్వెస్టర్లకు ఈ ప్రోడక్టు అనువైనది*:

•      దీర్ఘకాలికంగా ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ పనితీరుకు తగ్గ రాబడులను అందుకోవడం

•      నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం

యూటీఐ నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఫండ్

(నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ టీఆర్ఐని ప్రతిఫలించే/ట్రాక్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీము)

ఈ కింది లక్ష్యాలు గల ఇన్వెస్టర్లకు ఈ ప్రోడక్టు అనువైనది*:

•      దీర్ఘకాలికంగా ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ పనితీరుకు తగ్గ రాబడులను అందుకోవడం

•      నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం