
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,డిసెంబర్ 19,2024: ఓపెన్‌సిగ్నల్ 4G నెట్‌వర్క్ ఎక్స్‌పీరియెన్స్ రిపోర్ట్, నవంబర్ 2024 ప్రకారం, ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో అత్యుత్తమ 4G నెట్‌వర్క్ అనుభూతి అందించడంలో వొడాఫోన్ ఐడియా (Vi) ప్రశంసలు పొందింది. ఈ నివేదిక, స్మార్ట్‌ఫోన్ 4G యూజర్ల అనుభవాల ఆధారంగా రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో 4G నెట్‌వర్క్ అనుభూతికి సంబంధించి నాలుగు కేటగిరీలలో Vi అగ్రగామిగా నిలిచింది. ఇవి:
4G డౌన్‌లోడ్ స్పీడ్
4G వీడియో అనుభూతి
4G లైవ్ వీడియో అనుభూతి
4G వాయిస్ యాప్ అనుభూతి
4Gతో కనెక్ట్ అయినప్పుడు, 4G యూజర్లు వేగవంతమైన 4G స్పీడ్స్ మాత్రమే కాకుండా, వీడియోల లైవ్ స్ట్రీమింగ్, OTT వాయిస్ సర్వీసుల విషయంలోనూ అత్యుత్తమ నాణ్యతను అనుభవిస్తున్నారు.

“ఏపీ & తెలంగాణలో అత్యుత్తమ 4G నెట్‌వర్క్ అనుభూతి అందించడంలో మాకు గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరమైన విషయం. మా నెట్‌వర్క్‌ను పటిష్టపరచేందుకు, కస్టమర్లకు నిరంతర కనెక్టివిటీ అందించేందుకు మేము నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాం, దీనికి ఈ గుర్తింపు ప్రతిఫలం. మేము అత్యుత్తమ కనెక్టివిటీని అందించడంలో కట్టుబడి ఉన్నాం” అని క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఏపీ, తెలంగాణ & కర్ణాటక) ఆనంద్ దానీ తెలిపారు.
ఈ గుర్తింపు Vi నిబద్ధతను చూపిస్తుంది, డిజిటల్ అనుభవాన్ని మెరుగుపర్చడానికి,దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరచడానికి సంస్థ చేస్తున్న కృషిని సూచిస్తుంది. 2000 పైచిలుకు పట్టణాలు, 60 జిల్లాలలో వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్స్ అందించడానికి, 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను 10 మెగాహెట్జ్ నుంచి 20 మెగాహెట్జ్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని, Vi తమ 4G సామర్థ్యాలను 5,000 పైగా లొకేషన్లలో మెరుగుపర్చుకుంది.

ఇన్‌డోర్ నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపర్చేందుకు, 20 పైచిలుకు జిల్లాలు, 1,000 పైగా పట్టణాల్లో 3500+ లొకేషన్లలో L900 మెగాహెట్జ్‌ను వినియోగించి, 190+ కొత్త లొకేషన్లను జోడించింది. ఈ నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లు Vi GIGA నెట్‌వర్క్‌కు సంబంధించి నిరాటంకమైన అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభూతిని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.