
డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 25, 2024: ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ప్రొవైడర్లలో ఒకటైన వుయ్ వర్క్ ఇండియా తన సుస్థిరత సదస్సు రెండో ఎడిషన్ ను హైదరాబాద్ లోని క్రిషే ఎమరాల్డ్ లో నిర్వహించింది. ప్రారంభ ఎడిషన్ విజయవంతమైన తరువాత, ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశం ఇంధన నిర్వహణలో సహకారం, సృజనాత్మక పరిష్కారాలపై నొక్కిచెప్పింది, ఇది భారతదేశాన్ని సుస్థిర భవిష్యత్తు వైపు నడిపిస్తుంది.

కీలకమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్న విధాన నిర్ణేతలు, కార్పొరేట్ సస్టెయినబిలిటీ లీడర్లు, స్వచ్ఛంద సంస్థలకు వుయ్‌వర్క్ ఇండియా వారి సుస్థిరత సదస్సు కీలక వేదికగా అవతరించింది. సుస్థిర పద్ధతులను ప్రేరేపించడానికి రూపొందించిన అధిక-ప్రభావవంతమైన చర్చలు, కీలకోపన్యాసాలు, వర్క్‌షాప్‌ల ద్వారా ఇంధన సామర్థ్యం, సుస్థిరతను పెంపొందించడానికి కార్యాచరణ వ్యూహాలను ప్రధానంగా చర్చించిన ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు.
గత సంవత్సరంలో నిర్వహించిన సదస్సు వేగం ఆధారంగా.. దీర్ఘకాలిక సుస్థిరత లక్ష్యాల కోసం కృషి చేయడం ద్వారా, వుయ్ వర్క్ ఇండియా ఆకట్టుకునే సుస్థిరత మైలురాళ్లను సాధించింది. ఇందులో మొత్తం 19,582 KgCO2e ఉద్గారాలను తటస్థీకరించడం- ఒక దశాబ్దకాలం పాటు 324 మొక్కలను పెంచడం, మొత్తం కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ సెట్ 25,346 Kg CO2e తగ్గించడం, ఫ్లాగ్ రన్ సమయంలో 232 కిలోల వ్యర్థాలను సేకరించడం వంటివి ఉన్నాయి.

సుస్థిరత సదస్సు గురించి వుయ్‌వర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ మాట్లాడుతూ, “రియల్ ఎస్టేట్ రంగం చూపించే గణనీయమైన పర్యావరణ ప్రభావాన్ని గుర్తించి, క్రియాశీల మార్పుకు ఉత్ప్రేరకంగా మారడానికి మేము ముందడుగు వేశాం. సుస్థిరత అనేది వుయ్‌వర్క్ ఇండియాలో కేవలం కీవర్డ్ మాత్రమే కాదు… ఒక బ్రాండ్ గా, వ్యక్తులుగా మనం ఎవరనే దానిలో ఇది అంతర్భాగం. వుయ్‌వర్క్ ఇండియాలో, ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా వేసే ప్రతి అడుగూ ఆరోగ్యకరమైన భూమిని, మరింత స్థితిస్థాపక వ్యాపారాలను సృష్టించే దిశగా ఒక ముందడుగు అని మేము విశ్వసిస్తున్నాము.
తెలివైన, హరిత పద్ధతులను అవలంబించడం ద్వారా, మేము మా సొంత కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడమే కాకుండా, సుస్థిరతను వృద్ధి వ్యూహంలో ప్రధాన భాగంగా చేయడానికి మా సంస్థలు, ఎస్ఎంబీల కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నాము. కొత్త ఆలోచనలను ప్రేరేపించడం. కార్యాచరణ పరిష్కారాలను నడపడం, జీరో-కార్బన్ భవిష్యత్తు వైపు అర్థవంతమైన పురోగతిని సృష్టించే శాశ్వత ప్రభావాన్ని సృష్టించడం మా లక్ష్యం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు ప్యానల్ చర్చలు జరిగాయి. హరిత ఇంధనం, సుస్థిర భవన డిజైన్ల భవిష్యత్తుపై ప్రధాన దృష్టితో వుయ్ వర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ కీనోట్ అడ్రస్ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు సీఐఐకి చెందిన డాక్టర్ శివరాజ్ ఢాకా, అహుజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రతినిధి డాక్టర్ దిశా అహుజా, అంకుర్ క్యాపిటల్‌కు చెందిన విశాల్ కటారియా, ప్రో జీరో కార్బన్ ప్రతినిధి శంతను శర్మ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌కు చెందిన రోహిత్ చస్తా తదితరులు హరిత ఇంధన మౌలిక సదుపాయాలు, సుస్థిరత దిశగా వినియోగదారుల ప్రవర్తన గురించి చర్చించారు.

ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాధికా చౌదరి మోడరేట్ చేసిన మరో ప్యానల్ చర్చలో.. ప్రధానంగా ఏఐ ఆధారిత ఇంధన నిర్వహణ పరిష్కారాలపై చర్చించారు. ఇందులో యాంబియేటర్‌కు చెందిన జీతేన్ దేశాయ్, మిడ్‌వెస్ట్ ఎనర్జీకి చెందిన స్టాన్లీ ఛార్లెస్, వుయ్ వర్క్ ఇండియా ప్రతినిధి అర్ణవ్ గుసైన్, 75 ఎఫ్‌కు చెందిన విష్ణు ఆర్ కృష్ణన్, ఐఐటీ హైదరాబాద్ నిపుణుడు డాక్టర్ ప్రదీప్ యెముళ్ల, డిజిటల్ బ్లాంకెట్ ప్రతినిధి పృథ్వి కథావి పాల్గొన్నారు. ఇంకా, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో స్కూల్ ఆఫ్ సస్టెయినబులిటీ ఆధ్వర్యంలో ఇళ్లు, వ్యాపారాలకు అత్యాధునిక ఇంధన నిర్వహణ టెక్నిక్‌లపై ఒక లెర్నింగ్ సెషన్ నిర్వహించారు.
ఆర్యన్ గ్రూప్, పేస్ సీటింగ్ వారు స్పాన్సర్ చేసిన ఈ సుస్థిరత సదస్సు 2024.. హరిత భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. మొదటి ఎడిషన్‌లో చర్చించిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి… ఈవెంట్ మొత్తం కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను విజయవంతంగా ఆఫ్‌సెట్ చేయడం, నికర-సున్నా ప్రభావాన్ని నిర్ధారించడం, ఈవెంట్ సమయంలో ఉత్పత్తి అయిన మొత్తం 143 కిలోల వ్యర్థాలను ప్రాసెస్ చేసి, 96 కిలోలను రీసైక్లింగ్, 47 కిలోలను కంపోస్ట్ చేయడం.

చివరకు డంపింగ్ యార్డుకు ఏదీ వెళ్లకుండా చూసుకోగలిగారు. దాంతోపాటు.. జీరో-వేస్ట్ వర్క్ ప్లేస్ గైడ్ ను ప్రారంభించడం ద్వారా, సర్క్యులర్ ఎకానమీ సిద్ధాంతాల పట్ల వుయ్ వర్క్ ఇండియాకు ఉన్న నిబంధత బలపడింది. సానుకూల సామాజిక ప్రభావాన్ని ప్రేరేపించడానికి వుయ్‌వర్క్ ఇండియా వారి ఇతర ముఖ్యమైన కార్యక్రమాలలో కర్ణాటకలోని తరహునిస్ గ్రామం దత్తత, తరహునిస్ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులు, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వద్ద లివింగ్ విత్ లెపర్డ్స్ ప్రాజెక్ట్ ఉన్నాయి.