
డైలీ మిర్రర్ న్యూస్,జూన్ 23,2024 : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చెందిన ఓ గ్రూప్ ఫొటోను జనసేన పార్టీ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్, అనా కొణిదెల, అకీరా నందన్, ఆద్య ఉన్నారు. ఈ ఫొటో ఏ సందర్భంలో తీశారో కూడా జనసేన తన పోస్టులో వివరించింది.
‘ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట’ అని ఈ ఫొటోకు శీర్షిక పెట్టింది. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్లిక్ మనిపించిన అందమైన ఫొటో ఇది. ప్రమాణస్వీకారం చేసి మంగళగిరిలోని నివాసానికి బయల్దేరాలని అనుకుంటే… ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద దీరిన క్షణంలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటో ఇది” అని జనసేన వివరించింది.