డైలీ మిర్రర్ డాట్ న్యూస్,పుణె,31జనవరి, 2025: భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన బజాజ్ అలయంజ్ లైఫ్, తమ కొత్త బజాజ్ అలయంజ్ లైఫ్ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్‌ను ప్రవేశపెట్టింది.

ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ హెల్త్ రైడర్‌గా ఉంటుంది, ఇది 60 వరకు తీవ్రమైన క్రిటికల్ ఇల్‌నెస్ (సీఐ) పరిస్థితులను కవరేజ్ చేస్తుంది.

వైద్యపరమైన సంక్షోభ సమయంలో ఆర్థిక భద్రతను అందించడానికి, కస్టమర్ల పొదుపు నిల్వలు కాపాడేలా ఈ స్మార్ట్ యాడ్-ఆన్ రైడర్ రూపొందించనుంది. బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రముఖ టర్మ్ ప్లాన్ బజాజ్ అలయంజ్ లైఫ్ e-Touch II తో ఈ రైడర్‌ను తీసుకోవచ్చు.

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సహాయం బజాజ్ అలయంజ్ లైఫ్ ఈ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, వివిధ రకాల కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మెడిక్లెయిం లేని వారికి ఇది ఆర్థిక సాయాన్ని అందించి, అత్యవసర వైద్య పరిస్థితుల్లో పొదుపు మొత్తాలను కాపాడుతుంది.

బేసిక్ మెడిక్లెయిం కవరేజీ ఉన్న వారికి ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. అధిక మెడిక్లెయిం కవరేజీ ఉన్నవారి ఆదాయ నష్టాన్ని భర్తీ చేసి, జీవన విధానాన్ని కాపాడుతుంది.

తరుణ్ చుగ్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఎండీ & సీఈవో తెలిపారు:
“మీ పాలసీకి క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను జోడించడం అనేది ఆర్థిక ఆరోగ్యానికి ఒక బూస్టర్ షాట్‌లాగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వైద్యపరమైన అనిశ్చితుల వల్ల తలెత్తే అనూహ్య ఖర్చులను ఎదుర్కొనేందుకు రక్షణగా పనిచేస్తుంది.

మీ పొదుపు మొత్తాలను కాస్తా ఖర్చు చేయకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను పగిలిపోకుండా కాపాడుతుంది. చాలా తక్కువ వ్యయంతో చాలా శక్తివంతమైన రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది.”

బజాజ్ అలయంజ్ లైఫ్ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్ ప్రత్యేకతలు:

  • విస్తృత కవరేజీ: 18 సంవత్సరాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వరకు క్యాన్సర్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి 60 వరకు వివిధ తీవ్రమైన అనారోగ్యాలకు రక్షణ.
  • సరళ ఆప్షన్లు: క్రిటికల్ (10 మేజర్ CIs), ఎన్‌హాన్స్‌డ్ (25 మేజర్ CIs), కాంప్రహెన్సివ్ (60 మేజర్ CIs) ఆప్షన్లు.
  • పన్ను ప్రయోజనాలు: అర్హత ఆధారంగా పన్ను మినహాయింపులు.
  • హెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులు: రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సెకండ్ ఒపీనియన్లు,కన్సల్టేషన్లకు అంగీకారం.

ఈ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ల ద్వారా, బజాజ్ అలయంజ్ లైఫ్ పాలసీదారులకు వారి ఆర్థిక భద్రతపై మరింత నియంత్రణను అందించేందుకు ప్రయత్నిస్తోంది.