
డైలీ మిర్రర్ న్యూస్,ఆగస్టు 8,2024:పాలసీదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు నిశ్చింత కల్పించడానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ కీలకమైన అంశంగా ఉంటుంది. ఇది తక్కువ ప్రీమియంలతో గణనీయంగా లైఫ్ కవరేజీనిస్తుంది. పాలసీదారు అకాలంగా కన్నుమూసినా కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించగలదు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఈ-టచ్ అలాంటి సమగ్రమైన టర్మ్ ఇన్సూరెన్స్ పథకమే. పాలసీదారుల కుటుంబాలు తమ జీవిత లక్ష్యాల సాధన బాటలో ముందుకెళ్లడంలో తోడ్పడేలా విలువైన ఫీచర్లు గల మూడు వేరియంట్లలో ఈ పాలసీ లభిస్తుంది.

మార్కెట్లలో బజాజ్ అలయంజ్ లైఫ్ ఈ-టచ్ వంటి ఇతరత్రా వినూత్నమైన, వేల్యూ-ప్యాక్డ్ ప్రోడక్టులు తక్కువ ధరలకే లభిస్తున్నప్పటికీ తగినంత కవరేజీ ఉండాల్సిన ప్రాధాన్యతను కస్టమర్లు గుర్తించాలి. అండర్ఇన్సూరెన్స్ అనేది భారత్‌లో పెద్ద సమస్య. చాలా మంది తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు తగినంత కవరేజీ తీసుకోవడం లేదు. కవరేజీ అనేది వార్షికాదాయానికి కనీసం 10 రెట్లు ఉండాలనేది బండగుర్తు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఈ-టచ్‌తో పాలసీదార్లు ఈ ప్రమాణాన్ని అందుకోగలరు. అలాగే ఇది సమగ్రమైన హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులను కూడా అందిస్తుంది.
బజాజ్ అలయంజ్ లైఫ్ ఈ-టచ్‌లో మూడు వేరియంట్స్ ఉన్నాయి. అవేమిటంటే లైఫ్ షీల్డ్, లైఫ్ షీల్డ్ ఆర్వోపీ, లైఫ్ షీల్డ్ ప్లస్. ఈ మూడింటిలోనూ ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యం ఏర్పడినా లేక దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడినా ప్రీమియం వెయివర్ ఫీచర్ ఉంటుంది. లైఫ్ షీల్డ్ ఆర్వోపీ వేరియంట్లో, ఒకవేళ పాలసీ వ్యవధి ఆసాంతం పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో, వారు చెల్లించిన మొత్తం ప్రీమియంలకు సరిసమానమైన వన్-టైమ్ అమౌంటు మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది. ఇక లైఫ్ షీల్డ్ ప్లస్ వేరియంట్లో పాలసీదారు దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మరణించిన పక్షంలో వారి కుటుంబానికి రెగ్యులర్ డెత్ బెనిఫిట్‌తో పాటు అదనపు పేఅవుట్ కూడా చెల్లించబడుతుంది.

మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులను ఆఫర్ చేయడమనేది సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందజేయడంలో కంపెనీకి గల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సర్వీసులతో వైద్య సదుపాయాలకు సత్వరంగా, సులభతరంగా యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఆరోగ్య లక్ష్యాల సాధనలో కస్టమర్లకు తోడ్పాటు కూడా అందుతుంది. ఈ రెండు సదుపాయాలు ఒకే ప్రోడక్టులో సమగ్రపర్చబడ్డాయి. దీనితో సమగ్ర హెల్త్ చెకప్‌లు, రొటీన్ చెకప్‌లు మరియు చిన్నపాటి చికిత్సల కోసం కోసం ఓపీడీ ఇన్-క్లీనిక్ కన్సల్టేషన్లు పొందవచ్చు. అలాగే, మెడికల్ కన్సల్టేషన్లు,సమగ్ర వెల్-బీయింగ్ ఆఫరింగ్‌లకు కూడా సత్వరం యాక్సెస్ లభిస్తుంది.