
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, మార్చి 4, 2025: రక్త క్యాన్సర్ , ఇతర ప్రాణాంతక రక్త రుగ్మతలపై పోరాడేందుకు అంకితమైన లాభాపేక్షలేని సంస్థ DKMS ఫౌండేషన్ ఇండియా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT హైదరాబాద్) తో కలిసి రక్త మూల కణ అవగాహన ,దాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం IIT హైదరాబాద్ 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవం ఎలాన్ & ఎన్విజన్ 2025 లో నిర్వహించబడింది.
DKMS ఫౌండేషన్ ఇండియా ఈ కార్యక్రమానికి సామాజిక సంక్షేమ భాగస్వామిగా వ్యవహరించింది. భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాతల రిజిస్ట్రీ ఉండాల్సిన అవసరంపై యువతలో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడింది. రక్త క్యాన్సర్,ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవనాశ కాగల ఈ దానం ద్వారా, అనేక మంది ప్రాణాలను రక్షించే అవకాశం ఉంది.

ఈ అవగాహన కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. 350 మందికి పైగా విద్యార్థులు సంభావ్య రక్త మూల కణ దాతలుగా నమోదు చేసుకున్నారు.
సామాజిక బాధ్యతను అలవర్చే కార్యక్రమం
ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ ఎలాన్ & ఎన్విజన్ 2025 ఓవరాల్ కోఆర్డినేటర్ మెహుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “DKMS ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచడమే కాకుండా, మార్పుకు వేదికగా నిలవగలిగాం. ఒక్కరైన సరే రక్త మూల కణ దాతగా నమోదు కావడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలమనే విషయం విద్యార్థులు గుర్తించారు” అని తెలిపారు.
కార్యక్రమం ద్వారా రక్త మూల కణ దానం ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, రోగులకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

DKMS ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ పాట్రిక్ పాల్, “విద్యా సంస్థలతో మేము కలసికట్టుగా పనిచేయడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమైనది. ఇలాంటి కార్యక్రమాలు వారి ఆలోచనలపై సానుకూల ప్రభావం చూపుతాయి” అని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మరింత మంది రక్త మూల కణ దాతలు ముందుకు రావాలని, అవసరమైన వారికి జీవిత రక్షణ కల్పించగలమని DKMS ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.