
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,మార్చి 13, 2025: ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తన కార్డియోమెటబోలిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. మధుమేహం (T2DM) చికిత్సకు వినియోగించే SGLT2 ఇన్‌హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను (Empagliflozin) భారత మార్కెట్లో విడుదల చేసింది.
అంతేకాదు, ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లుగా (FDCs) గ్లెంపా-ఎల్ (Empagliflozin 10/25mg + Linagliptin 5mg), గ్లెంపా-ఎం (Empagliflozin 12.5mg + Metformin 500/1000mg) పేరుతో కూడ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఔషధాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు హృద్రోగ సమస్యలు తగ్గించేందుకు తోడ్పడతాయని సంస్థ వెల్లడించింది.
Read this also…Glenmark Launches Empagliflozin in India
ఇది కూడా చదవండి…సొంత వాటా నుంచి ప్రూడెంట్ షేర్లను బహుమతిగా అందజేస్తున్న ప్రమోటర్ సంజయ్ షా
ఇది కూడా చదవండి…“సామ్‌సంగ్ గెలాక్సీ బుక్5 సిరీస్ పిసిల విడుదల
ఎంపాగ్లిఫ్లోజిన్ అత్యధిక సీవీ (కార్డియోవాస్కులర్) రిస్క్ కలిగిన టీ2డీఎం రోగులకు ప్రయోజనకరమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. EMPA-REG క్లినికల్ ట్రయల్‌లో ఈ ఔషధం వాడిన రోగుల్లో తీవ్రమైన హృద్రోగ సమస్యలు 14% తగ్గాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటు బరువు నియంత్రణలోనూ సహాయపడుతుందని గ్లెన్‌మార్క్ పేర్కొంది.

పేషంట్ల అవసరాలకనుగుణంగా మూడు వేరియంట్లు
పేషంట్లకు అనువుగా మూడు వేర్వేరు వేరియంట్లలో ఈ ఔషధాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్లెన్‌మార్క్ తెలిపింది.
గ్లెంపా (Empagliflozin 10mg/25mg): గ్లైసెమిక్ నియంత్రణతోపాటు కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గించే స్టాండెలోన్ SGLT2 ఇన్‌హిబిటర్.
గ్లెంపా-ఎల్ (Empagliflozin + Linagliptin): రెండు డిఫరెంట్ మెకానిజంతో పనిచేసే ఔషధాల సమ్మేళనం. ఇది కార్డియో-రీనల్ రిస్క్ ఉన్న టీ2డీఎం రోగులకు మేలు చేస్తుంది.
గ్లెంపా-ఎం (Empagliflozin + Metformin): మెట్‌ఫార్మిన్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక గ్లైసెమిక్ నియంత్రణ అందించే కాంబినేషన్.
ఇది కూడా చదవండి…“వీవింగ్ ది ఫ్యూచర్ – హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు విజయవంతంగా ముగిసింది”
Read this also…Synchrony India Recognized Among Top 50 Best Workplaces for Innovation in 2025
Read this also…Swadesh Honors Women Champions of Craft & Creative Traditions on Women’s Day
‘‘భారతదేశంలో మధుమేహం, కార్డియోవాస్కులర్ వ్యాధులు పెరుగుతున్న తరుణంలో గ్లెన్‌మార్క్ గ్లెంపా శ్రేణిని మార్కెట్లోకి తీసుకురావడం గర్వకారణం. రోగులకు అధునాతన, చౌక ధరలో చికిత్స అందించాలనే మా దృష్టిలో ఇది మరో ముందడుగు’’ అని గ్లెన్‌మార్క్ ఇండియా ఫార్ములేషన్స్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ తెలిపారు.
ఈ కొత్త ఔషధాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది టీ2డీఎం రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గ్లెన్‌మార్క్ సిద్దమవుతోంది. త్వరలోనే ఇవి అన్ని మెడికల్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.