డైలీమిర్రర్ డాట్. న్యూస్, మార్చి 19, 2025: మల‌యాళ సూప‌ర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2E: ఎంపురాన్’ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీ అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా, ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త సినిమాటిక్ లార్జ‌ర్ దేన్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ చిత్రాన్ని IMAX® లో విడుద‌ల చేస్తుండ‌టం విశేషం.

Read this also…Experience the Grand Spectacle: Mohanlal and Prithviraj Sukumaran’s L2E: Empuraan Arrives in IMAX® on March 27, 2025!

Read this also…Mahindra WE Hunnar Initiative: Empowering Women in Mobility

ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌లాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ ‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో విడుద‌ల చేస్తుండ‌టం చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా ఇదే కానుండ‌టం ఇదే గ‌ర్వ‌కార‌ణం. ఇక్క‌డి నుంచి మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఐమ్యాక్స్‌తో ఓ మంచి, సుధీర్ఘ‌మైన అనుబంధానికి ఇది నాంది ప‌లుకుతుంది. మార్చి 27న ఐమ్యాక్స్ స్క్రీన్స్‌పై మా సినిమాను వీక్షించండి’’ అన్నారు.

https://x.com/Mohanlal/status/1901974183791505811
‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని 1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఐమ్యాక్స్‌లో సినిమా చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు విజువ‌ల్‌గా, సౌండ్ ప‌రంగా మ‌రింత గొప్ప అనుభూతికి లోన‌వుతాన‌డ‌టంలో సందేహం లేదు.

మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మ‌రోసారి మాస్ అవ‌తార్‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్  థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

Read this also…APTA North Central Women’s Day & JanaSena 11th Anniversary Celebrations: A Night of Empowerment and Unity

Read this also…Daimler Truck Reports Strong 2024 Financial Results with 17% Growth in EV Truck Sales

మ‌ల‌యాళ చిత్రసీమ‌లోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్‌’. లూసిఫ‌ర్ ట్రియోల‌జీలో ఇది రెండో భాగం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తోంది.