డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని ప్రముఖ ఎస్ యు వి  తయారీదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, కొత్తగా విడుదల చేసిన థార్ ROXX  ఉదయం 11.00 గంటలకు బుకింగ్ ప్రారంభమైన తరువాత కేవలం 60 నిమిషాలలోపుగానే   1,76,218 బుకింగ్‌లను నమోదు చేసుకునట్లు  వెల్లడించింది.

ఈ అపూర్వమైన స్పందన దేశవ్యాప్తంగా కస్టమర్‌లకు థార్  ROXX పట్ల వున్న ఆసక్తి, బ్రాండ్ పట్ల వున్నా ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. చూడగానే ఆకట్టుకునే డిజైన్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం, శక్తివంతమైన పనితీరు, సాటిలేని ఆఫ్-రోడింగ్ సామర్థ్యం,​​అత్యుత్తమ భద్రతా ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్స్,అధునాతన సాంకేతికతతో, థార్ ROXX కొత్త బెంచ్‌మార్క్‌లను ఎస్ యు వి  విభాగం లో నిర్దేశించనుంది.

థార్ ROXX  డెలివరీలు దసరా శుభ సందర్భంగా ప్రారంభమవుతాయి. ఈ  ఉత్సాహభరితమైన స్పందన పట్ల తమ కస్టమర్లకు మహీంద్రా కృతజ్ఞతలు తెలుపుతుంది. సౌకర్యవంతమైన డెలివరీ అనుభవాలను అందించటానికి మహీంద్రా కట్టుబడి ఉంది. డెలివరీలు ప్రారంభమైన తరువాత, మహీంద్రా తమ తాత్కాలిక డెలివరీ షెడ్యూల్‌ల గురించి తదుపరి మూడు వారాల్లో దశలవారీగా వినియోగదారులకు తెలియజేస్తుంది.

థార్ ROXX కోసం బుకింగ్‌లు అన్ని అధీకృత మహీంద్రా డీలర్‌షిప్‌లు,మహీంద్రా వెబ్‌సైట్‌లో తెరిచి ఉన్నాయి. 

Social Media Addresses for Thar ROXX:

●       Brand website: https://auto.mahindra.com/thar-ROXX.html

●       Instagram: @mahindrathar

●       Facebook: @mahindrathar

●       Twitter: @Mahindra_Thar

●       YouTube: @TharMahindra

●       Hashtags: #TharROXX #THESUV #ExploreTheImpossible