
డైలీమిర్రర్ డాట్ న్యూస్, ఫిబ్రవరి 21,2025: ఈటీవీ విన్ ఓటిటిలో విడుదలైన సమ్మేళనం వెబ్ సిరీస్ ప్రేమ, స్నేహం, వినోదాల మేళవింపుగా రూపొందింది. గణాదిత్య హీరోగా నటించగా, ప్రియా వడ్లమాని హీరోయిన్‌గా అలరించింది. ఆమెతో పాటు విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి ముఖ్య పాత్రల్లో నటించారు. తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సునయన బి, సాకేత్ జె నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం..
కథ..

రామ్ (గణాదిత్య) అనే రచయిత రాసిన పుస్తకం అద్భుత స్పందన పొందుతుంది. దీంతో పత్రికల్లో ప్రాచుర్యం పొందిన అతనిని శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విఘ్నయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) వెతుక్కుంటూ వస్తారు.
అర్జున్, రామ్ చిన్ననాటి స్నేహితులు. రామ్ రచయిత కావాలని లక్ష్యంగా పెట్టుకోగా, అర్జున్ అతనికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటాడు. కానీ, అర్జున్ తన కార్యాలయంలో కలిసిన మేఘనను ప్రేమిస్తాడు. అయితే, రామ్ కూడా ఆమెను ప్రేమించడం కథను మలుపు తిప్పుతుంది. మరి, మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ప్రేమ ముగింపు ఎలా ఉండబోతుంది? చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెబ్‌సిరీస్‌లో తెలుస్తుంది.
Read this also...Saurabh Srivastava Rejoins Housr as Chief Business Officer to Drive Growth and Expansion
విశ్లేషణ..
Sammelanam ప్రేమ, స్నేహం, వినోదాన్ని మిళితం చేసిన కథ. దర్శకుడు తరుణ్ మహాదేవ్, నిర్మాతలు సునయన-సాకేత్ లు ఫ్యామిలీ ఆడియన్స్‌కి అనువైన కథను అందించారు.
సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఓ డైలాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. “మాకు మాట్లాడే హక్కు కూడా ఉందా, సోదరి?” అని పనిమనిషి అడిగితే, యజమాని సమాధానం ఇస్తాడు – “రాజ్యాంగం మనకు మాట్లాడే హక్కును ఇచ్చింది, కానీ సమాజం దానిని తీసేసింది.” అని.
తరుణ్ మహాదేవ్ కథలో కొత్తదనం లేకపోయినా, టేకింగ్‌లో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నాయి. కథ రొటీన్ అయినా, కొన్ని హుక్ పాయింట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సంగీతం పరంగా యశ్వంత్ నాగ్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. కెమెరా, లైటింగ్ అందంగా తీర్చిదిద్దారు.
ఇది కూడా చదవండి...అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఐఏ & భద్రతా సదస్సు విజయవంతంగా నిర్వహణ
ఇది కూడా చదవండి...హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా 783 మంది విద్యార్థులకు రూ. 3.38 కోట్ల స్కాలర్‌షిప్‌లు
నటీనటుల నటన..
గణాదిత్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన బాగుంది. ప్రియా వడ్లమాని తన పాత్రకు న్యాయం చేసింది. బిందు, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ యాచమనేని, జీవన్ ప్రియా రెడ్డి తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
సమ్మేళనం వెబ్‌సిరీస్‌లోని పాటలు కొత్త అనుభూతిని ఇస్తాయి. కథనం, సన్నివేశాల ప్రదర్శన, సంగీతం, అన్నింటి కలయికగా కుటుంబమంతా చూడదగిన వెబ్‌సిరీస్ ఇది. డైలీమిర్రర్ డాట్ న్యూస్ Rating 3.5..