డైలీ మిర్రర్ డాట్ న్యూస్ 21 మార్చి 2025: ఓ గ్రామంలో విగాండ (చిరాగ్ జానీ)కి ఓ కుమారుడు జన్మిస్తాడు. అతనికి ఆరు ముఖాలుంటాయి. దాంతో అతన్ని సాధారణ వ్యక్తిగా మార్చేందుకు మాంత్రికుడు సూచించిన పద్ధతిని అనుసరిస్తాడు విగాండ. యువతులను కిడ్నాప్ చేసి, బలి ఇస్తూ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు, రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) ఈ ఘటనలపై ఆసక్తి చూపిస్తుంది. తన గత ప్రియుడు, పోలీస్ ఆఫీసర్ కార్తీ (ఆది సాయికుమార్) సాయంతో విచారణ ప్రారంభిస్తుంది. చివరకు వీరు విగాండను ఎదుర్కొని, నిజాన్ని బయటపెట్టగలిగారా? అనేదే కథ.

ప్లస్ పాయింట్స్:
ఆసక్తికరమైన కథ, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే
ఆది సాయికుమార్, అవికా గోర్, చిరాగ్ జానీ నటన
రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
విజువల్స్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ
శక్తివంతమైన క్యారెక్టరైజేషన్


మైనస్ పాయింట్స్:


కొన్ని చోట్ల నెమ్మదించిన నేరేషన్
క్లైమాక్స్ మరింత ఇంపాక్ట్ ఇచ్చేలా డిజైన్ చేయాల్సిన అవసరం

Read this also…72nd Miss World Festival to be Hosted in Telangana, Uniting 140 Nations

Read this also…TCS and Air New Zealand Join Forces for AI-Led Transformation and Enhanced Passenger Experience


ఆదికి హిట్‌..


‘షణ్ముఖ’ డిఫరెంట్ కథతో డివోషనల్ థ్రిల్లర్. షణ్ముగం సప్పని దర్శకత్వం, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఆదికి ఈ సినిమా హిట్‌ అందించే అవకాశం ఉంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ‘షణ్ముఖ’ ఆకట్టుకునే సినిమా.

విడుదల తేదీ: 21 మార్చి 2025
కాస్ట్: ఆది సాయికుమార్, అవికా గోర్, చిరాగ్ జానీ, ఆదిత్య ఓం, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా తదితరులు
బ్యానర్: సాప్ బ్రో ప్రొడక్షన్స్..
నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. విష్ణు
ఎడిటర్: ఎంఏ మాలిక్
దర్శకుడు: షణ్ముగం సప్పని.

డైలీ మిర్రర్ డాట్ న్యూస్ రేటింగ్: ⭐⭐⭐✨ (3.5)