డైలీ మిర్రర్ డాట్ న్యూస్,సెప్టెంబర్ 29,2024: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఉన్నత ధర్మసనంలోని జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లు ఈ విచారణ జరుపనున్నారు.
బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషనర్లు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.
ఎన్ డి డిబి ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పిటిషన్‌లో వినతి పొందింది. సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో ఉపయోగించకపోవడంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటీషనర్లు, లడ్డూ అపవిత్రతకు ఏమి సంబంధమని ప్రశ్నించారు.
ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారని వాదనలు వినిపించాయి. ఎస్ఓపి ప్రకారం, పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడడం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం. ఈ నేపథ్యంలో, ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.