
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 30 ఏప్రిల్ 2025: రహదారి భద్రత అనే కీలకమైన సమస్యను పరిష్కరించే సమిష్టి ప్రయత్నంలో, రాపిడోతో తెలంగాణ రవాణా శాఖ కలిసి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర జాగృతి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ భాగస్వామ్యం ద్వారా పౌరులకు సురక్షితమైన రైడింగ్ పద్ధతులపై అవగాహన కల్పించడం, హెల్మెట్ వాడవలసిన అవసరాన్ని తెలియజేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ప్రమాదాలను, గాయాలను తగ్గించడం, రహదారిని వినియోగించే ప్రతి వినియోగదారునికి రక్షణ కల్పించడం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, ప్రయాణికులలో బాధ్యత భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రయత్నంలో రోడ్డు భద్రత ప్రధానమైన అంశం. భాగస్వామ్యంలో భాగంగా, రాపిడో, రవాణా శాఖ తెలంగాణ వ్యాప్తంగా పలు దశల్లో రహదారి భద్రతను, అవగాహన జాగృతిని కల్పిస్తాయి. ఈ క్యాంపెయిన్‌లో ముఖ్యంగా, డ్రైవర్ శిక్షణ కార్యక్రమాలు, ప్రజా వర్క్‌షాప్‌లు, హెల్మెట్ పంపిణీ డ్రైవ్‌లు, రహదారి భద్రత ప్రాముఖ్యతపై సమాజానికి అవగాహన కల్పించేందుకు రూపొందించిన వినూత్న ఔట్రీచ్కార్యకలాపాలు ఉన్నాయి.
Also read this…Telangana Government and Rapido Collaborate to Enhance Road Safety Across the State
Also read this…Instamart partners with Kalyan Jewellers to deliver Gold and Silver Coins just in time for Akshaya Tritiya..
Also read this…UTI Mutual Fund Launches UTI Multi Cap Fund with New Fund Offer..
హైదరాబాద్‌లో నేడు నిర్వహించిన సారథి (SARATHI)కార్యక్రమంలో, రాపిడో 250 హెల్మెట్లను వితరణ చేసింది. రైడర్లు, కెప్టెన్లు మరియు విస్తృత స్థాయిలో పౌర సముదాయానికి భద్రతను పెంచడంలో తన నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుంది. ఈ ప్రయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని పెంపొందించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించడాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

ఈ సందర్భంలో రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ, ‘‘రహదారి భద్రత, బాధ్యతాయుతమైన మొబిలిటీని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సహకరించేందుకు అవకాశం దక్కడం మాకు లభించిన మంచి అవకాశం. ఈ భాగస్వామ్యం ద్వారా, తెలంగాణలోని రహదారులను అందరికీ సురక్షితంగా మార్చడానికి అర్థవంతంగా దోహదపడాలని మేము కోరుకుంటున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలకు రాపిడో సేవలను విస్తరించామని ప్రకటించేందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. అదనంగా, హైదరాబాద్‌లోని మా ‘పింక్ మొబిలిటీ’ ప్రయత్నం జెండర్-ఇన్‌క్యూజివ్, సురక్షితమైన రవాణా పరిష్కారాలకు మా నిబద్ధతను చాటి చెబుతుంది. దానితో పాటు, కనెక్టివిటీ, భద్రత ,సమ్మిళితత్వానికి ప్రాధాన్యతనిచ్చే రవాణా పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని వివరించారు.
‘‘సురక్షితమైన రహదారులు, సమ్మిళిత మొబిలిటీని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది’’ అని ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ రవాణా కమిషనర్ కె. సురేంద్ర మోహన్వ్యాఖ్యానించారు. ఈ సహకారం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి శ్రేయస్సును నిర్ధారిస్తూ రహదారి భద్రత, వినూత్న రవాణా పరిష్కారాల పట్ల మా నిబద్ధతను చాటి చెబుతుంది’’ అని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం తెలంగాణ రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రభావవంతమైన ప్రభుత్వ-ప్రైవేట్ సహకారాలకు ఒక నమూనాగా పనిచేస్తుంది. కలిసి పనిచేయడం ద్వారా, తెలంగాణ రవాణా శాఖ మరియు రాపిడో రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన రహదారులు, మరింత సమ్మిళిత మొబిలిటీ చట్రాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.