
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, 29ఆగస్టు 2024:భారతీయ కంటెంట్, వినోద రంగ దిగ్గజం,గ్లోబల్ క్రికెట్ లీగ్ ‘డీపీ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20)’కి అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వామి అయిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, 2025 జనవరి 11 నుంచి జరగబోయే ఉత్తేజకరమైన మూడో సీజన్‌కి సంబంధించిన ప్రణాళికలను ఆవిష్కరించింది.
34 మ్యాచ్‌ల ఈ టోర్నమెంటు నెల రోజుల పాటు సాగుతుంది. 2025 ఫిబ్రవరి 9న ముగుస్తుంది. రాబోయే లీగ్ సందర్భంగా దక్షిణాది చానళ్లవ్యాప్తంగా వ్యూయర్షిప్ను పెంచుకోవడం, 23 కోట్ల వ్యూయర్షిప్ సాధించడం అనే లక్ష్యాలతో క్రికెట్ ప్రేమికులకు, ముఖ్యంగా భారతీయ క్రికెట్ ప్రేమికులకు, నెల రోజులపాటు మర్చిపోలేని క్రికెట్ కార్నివాల్ అనుభూతిని అందించాలనేది ఈ ప్రణాళికల్లో భాగంగా సంస్థ నిర్దేశించుకుంది.

భారత్ అలాగే ప్రపంచ దేశాల్లోని క్రికెట్ ఫ్యాన్స్, క్రీడాభిమానులు లైవ్ యాక్షన్‌ను ప్రతి సాయంత్రం జీ ఎంటర్టైన్మెంట్కి చెందిన 15 లీనియర్ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఉచిత స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.
మూడో సీజన్ దగ్గరపడే కొద్దీ తమ లీనియర్ ఛానళ్లతో పాటు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ఉర్రూతలూగించే క్రీడాసంరంభాన్ని ఆకట్టుకునే విధంగా అందిస్తామని జీ ఎంటర్టైన్మెంట్ హామీనిస్తోంది.
“దక్షిణాది ఆడియెన్స్‌కి యూఏఈతో గల బలమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని దక్షిణ భారతీయ చానెళ్లను మా లైనప్‌కి జోడించడం ద్వారా మేము మా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాం. యూఏఈ జనాభాలో 30% ప్రజలు దక్షిణాసియా నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి వచ్చినవారే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో దక్షిణ భారత వీక్షకులకు మరింతగా చేరువయ్యేందుకు మా ప్రయత్నం తోడ్పడగలదు. హై-క్లాస్ క్రికెట్,సౌకర్యవంతమైన, విలాసవంతమైన వేదిక మేళవింపుతో క్రికెట్ ప్రేమికులకు స్పోర్టింగ్ కార్నివాల్ అనుభూతిని అందించాలనే మేము లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

నెల రోజుల పాటు సాగే ఈ ఈవెంట్, ముఖ్యంగా యూఏఈని సందర్శించే భారతీయ ట్రావెలర్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతూ, అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులకు ఒక వినూత్నమైన అనుభూతిని అందించనుంది.
తమ ప్రీమియం కస్టమర్లతో కనెక్ట్ అయ్యేందుకు, తమ ప్రీమియం బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు అడ్వర్టైజర్లకు ఈ ఈవెంట్ ఒక చక్కని అవకాశంగా కూడా ఉండగలదు” అని దక్షిణ భారతీయ చానెళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టడంపై స్పందిస్తూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ – డిజిటల్ & బ్రాడ్కాస్ట్ రెవెన్యూ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీ ఆశీష్ సెహ్గల్ తెలిపారు.
డీపీ వరల్డ్ ఐఎల్టీ20 రెండో సీజన్లో 30 గేమ్స్వ్యాప్తంగా 2,00,000 మంది పైచిలుకు హాజరయ్యారు. అంతర్జాతీయంగా అత్యధికంగా వీక్షించే టీ20 క్రికెట్ లీగ్‌ల్లో ఈ లీగ్ రెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి ఏకంగా 22.1 కోట్ల మంది వీక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 34.8 కోట్ల యూనిక్ వ్యూయర్స్ దీన్ని వీక్షించారు.
జీకి చెందిన 10 లీనియర్ టీవీ చానెళ్లు ,తమ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 మేళవింపును సమర్ధమంతంగా వినియోగించేలా జీ నెట్వర్క్ అమలు చేసిన బ్రాడ్‌కాస్టింగ్ వ్యూహం ఈ విజయానికి దోహదపడింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) తర్వాత అంతర్జాతీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ టోర్నమెంటుపై మాట్లాడుతూ, “డీపీ వరల్డ్ ఐఎల్టీ 20 విశిష్టత ఏమిటంటే ప్రామాణికమైన నలుగురు అంతర్జాతీయ ప్లేయర్లకు బదులుగా తొమ్మిది మందిని తీసుకోవచ్చు.
అంతేగాకుండా ఇందులో హోమ్ అండ్ అవే ఫార్మాట్ లేకపోవడం కూడా మిగతా లీగ్‌లతో పోలిస్తే ఐఎల్టీ20ని భిన్నమైనదిగా నిలుపుతుంది. మూడు వేదికలైన షార్జా, దుబాయ్, అబు ధాబిల్లో ప్రతి టీమ్ తమ సొంత ప్రదేశంలోనే ఉన్నట్లుగా అనుభూతి చెందగలదు. ఇక ఇప్పుడు టీమ్‌పై విశ్వసనీయతను పెంచడంపై దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చింది.
యూఏఈలో అద్భుతమైన స్టేడియంలు, ఏడాది తొలినాళ్లలో చక్కని వాతావరణం, ప్లేయర్లకు సౌకర్యవంతమైన పరిస్థితులు మొదలైనవి ఉంటాయి. ఆతిథ్యానికి ఎమిరాటి ప్రజలు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే సందర్శకులను వారు సాదరంగా స్వాగతిస్తారు. అంతర్జాతీయ టీమ్‌లకు చెందిన టాప్ ప్లేయర్లు ఉండటమనేది ఈ ఈవెంట్‌కి ప్రపంచ స్థాయి హంగులు అద్దుతుంది.

దుబాయ్‌ని ప్రీమియర్ స్పోర్టింగ్ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు మేము జీతో కలిసి పని చేస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి సంఘర్షణకు తావు ఉండకుండా ప్రత్యామ్నాయ విండోను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని డీపీ వరల్డ్ ఐల్టీ20 సీఈవో శ్రీ డేవిడ్ వైట్ తెలిపారు.
మూడో సీజన్లో మరింత మంది ఆడియెన్స్‌కి, అంటే, 23 కోట్ల మంది వీక్షకులకు చేరువ కావాలని టోర్నమెంటు లక్ష్యంగా పెట్టుకుంది. వ్యూయర్షిప్ను పెంచుకునేందుకు ప్రధానంగా క్రికెట్ ప్రేమికులు, ప్రకటనకర్తలు లక్ష్యంగా దక్షిణ భారతీయ చానెళ్లను జోడించడం సహా భారతీయ మార్కెట్‌పై ఫోకస్‌తో బహుళ వ్యూహాలు అమలు చేయబడుతున్నాయి.
గత సీజన్లో ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, గుజరాత్,మహారాష్ట్ర వంటి మార్కెట్లలో ఈ మ్యాచ్‌లకు గణనీయమైన స్పందన లభించింది. ఈ ఏడాది టోర్నమెంటు ఆన్-ఎయిర్ ప్రమోషన్ అనేది 40 చానెళ్లవ్యాప్తంగా నిర్వహించబడనుంది. వ్యూయర్షిప్ను పెంచుకునే వ్యూహాల్లో భాగంగా డీపీ వరల్డ్ ఐఎల్టీ20 సీజన్ 3 దక్షిణ భారత చానెళ్లపై కూడా ఫోకస్ పెట్టనుంది.

కొత్త ఒప్పందాలను లీగ్ వచ్చే నెల, సెప్టెంబర్ 15న ప్రకటించనుంది. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, డేవిడ్ వార్నర్, జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి క్రీడాకారుల సమక్షంలో ప్రస్తుత రోస్టర్ కొనసాగనుంది. లీగ్‌లో మొత్తం మీద ఏకంగా 60,000 రిజిస్టర్డ్ క్రికెటర్లు ఉన్నారు.
ఫ్రాంచైజీ తరహా టోర్నమెంటు అయిన డీపీ వరల్డ్ ఐపీఎల్ టీ20లో ఆరు టీమ్‌లు యూఏఈవ్యాప్తంగా 34 మ్యాచ్‌లు ఆడతాయి. అబు ధాబి నైట్‌రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెజర్ట్ వైపర్స్ (లాన్సర్ క్యాపిటల్), దుబాయ్ క్యాపిటల్స్ (జీఎంఆర్), గల్ఫ్ జయంట్స్ (అదానీ స్పోర్ట్స్‌లైన్), ఎంఐ ఎమిరేట్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్) మరియు షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) వీటిలో ఉన్నాయి.