డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 28, 2025:నమ్మకం అంటే జనప్రియ.. జనప్రియ అంటే నమ్మకం! రియల్ ఎస్టేట్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా ఈ పేరుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పుడు ఆ సంస్థ మరో ఘనమైన మైలురాయి దాటేసింది. 40 ఏళ్లు పూర్తి.. 40 వేల ఫ్లాట్లు డెలివరీతో జనప్రియ ఉప్‌స్కేల్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ డబుల్ ధమాకా సంబరాలను జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదే సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కె. రవీందర్ రెడ్డి గారి 72వ జన్మదినోత్సవాన్ని కూడా అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రముఖ గాయకుడు రేవంత్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

వేడుకలో మాట్లాడిన మేనేజింగ్ డైరెక్టర్ కె. క్రాంతి కిరణ్ రెడ్డి.. “40 ఏళ్లుగా ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ మార్పులు ఎన్ని వచ్చినా.. నా తండ్రి గారు వేసిన బలమైన పునాదిపై ఎదిగాం. ఈ విజయం అందరిదీ.. మరిన్ని అద్భుత ప్రాజెక్టులతో ముందుకు దూసుకెళ్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.

ఛైర్మన్ కె. రవీందర్ రెడ్డి గారు గతాన్ని గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు ఇంటి లోన్ కోసం జనం ఎంత ఇబ్బంది పడ్డారో చూశాను. హౌసింగ్ బోర్డు, హుడా, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి స్ఫూర్తి పొంది.. అందరికీ అందే ధరలో ఇళ్లు అందించాలని జనప్రియను ప్రారంభించాను. ఈ రోజు 40 వేల కుటుంబాలు మా ఇళ్లలో సంతోషంగా ఉంటే.. అదే నా జీవితంలో అతి పెద్ద బహుమతి” అని భావోద్వేగంతో పేర్కొన్నారు.

జనప్రియ ప్రతినిధులు, సిబ్బంది, సన్నిహితులు, బిల్డర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మెమరబుల్ ఈవెంట్‌ను విజయవంతం చేశారు. నాలుగు దశాబ్దాల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయి.