డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 19,2025: రూ.5 జేబుదారం ధరకే నోరూరించే మోల్టెన్ చాకో అనుభవం… ఇక ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందించొచ్చు! ITC సన్‌ఫీస్ట్ ఫెంటాస్టిక్ సరికొత్త ఆవిష్కరణ ‘చాకో మెల్ట్జ్’ను మార్కెట్‌లోకి దింపింది.
స్క్వీజ్ చేసి నేరుగా తాగొచ్చు… బ్రెడ్, పరాఠా, టోస్ట్‌పై రాసుకోవచ్చు… ఐస్‌క్రీమ్, పండ్లపై పోసుకోవచ్చు… ఏదైనా సాధారణ స్నాక్‌ను సూపర్ యమ్మీ ట్రీట్‌గా మార్చేసే మ్యాజిక్ ఇది!
ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు… ప్యాకెట్ తెరిచి నొక్కితే సాఫ్ట్‌గా, స్మూత్‌గా రిచ్ చాకో ప్రవాహం! రోజువారీ “యమ్” క్షణాలను “యమ్మీ” ఆనందాలుగా మార్చే ఈ కొత్త ఉత్పత్తికి బ్రాండ్ స్లోగన్ కూడా అదిరిపోతోంది – “యమ్ నుంచి యమ్మీ!”

కొత్త టీవీసీలో అక్కాచెల్లెళ్లు రహస్యంగా చాకో షేర్ చేసుకోవడం… బెస్ట్ ఫ్రెండ్స్ డెస్క్ కింద దాచి తినడం… అమ్మ-బిడ్డలు కలిసి రుచి చూడటం… ఇలా రోజువారీ ఫన్ మూమెంట్స్‌ను చూపిస్తూ చాకో మెల్ట్జ్ మ్యాజిక్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు.
ఐటీసీ ఫుడ్స్ డివిజన్ వీపీ & హెడ్ మార్కెటింగ్ అనుజ్ బన్సల్ మాట్లాడుతూ… “సన్‌ఫీస్ట్ ఫెంటాస్టిక్ ఎప్పుడూ ఆనందాన్ని అందరికీ అందించే బ్రాండ్. కేవలం రూ.5కే రిచ్ మోల్టెన్ చాకో అనుభవాన్ని ఇంటింటికీ చేరుస్తున్నాం. ఇది ఒక చాకో కాదు… రోజువారీ హ్యాపీ మూమెంట్స్ కోసం పర్ఫెక్ట్ కంపానియన్!”
ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో అందుబాటులో ఉన్న చాకో మెల్ట్జ్… త్వరలోనే దేశవ్యాప్తంగా రానుంది.

