డైలీమిర్రర్ డాట్ న్యూస్, ఇండియా,జ‌న‌వ‌రి 8, 2025: భారత్, ఆగ్నేయాసియాలో ఉన్న సాహసోపేతమైన వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రారంభ దశ (ఎర్లీ స్టేజ్) ఫండ్ కోసం 650 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థ యాక్సెల్ ప్రకటించింది. యాక్సెల్ ఈ తాజా ఫండ్, భారత్ మరియు ఆగ్నేయాసియాలో ఎనిమిదోది.

విప్లవాత్మకమైనవి, అర్థవంతమైన ప్రభావాన్ని చూపేలా నిర్దిష్ట కేటగిరీని కొత్తగా నిర్వచించే వ్యాపారాలను నిర్మించేందుకు, ప్రారంభ దశ వ్యవస్థాపకులకు మద్దతు అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. యాక్సెల్, తన 40 సంవత్సరాల అనుభవంతో, గ్లోబల్ ప్లాట్‌ఫాం ఉపయోగించి, వ్యవస్థాపకులకు అవసరమైన మెంటార్‌షిప్, నెట్‌వర్క్‌పరమైన మద్దతును అందిస్తుంది.

ఈ ఫండ్ ద్వారా ఏఐ, కన్జూమర్ బ్రాండ్స్, ఫిన్‌టెక్ మరియు తయారీ రంగ సంస్థల వ్యవస్థాపకులతో యాక్సెల్ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ థీమ్‌లలో, యాక్సెల్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్న ఉప-విభాగాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • కృత్రిమ మేథ: ఎంటర్‌ప్రైజ్ ఏఐ (ఏజెంటిక్ టెక్నాలజీలు, ఎల్ఎల్ఎంలు, ఎస్ఎల్ఎంలతో సహకారంతో ఎంటర్‌ప్రైజ్ ఏఐను ఉపయోగించే అవకాశాలను కల్పించే ప్లాట్‌ఫాంలు), సర్వీసెస్ యాజ్ సాఫ్ట్‌వేర్ (భారతదేశపు ఐటీ సేవలను ఉపయోగించి మెరుగైన ఆటోమేషన్ సొల్యూషన్స్ అందించే ఏఐ స్టార్టప్‌లు), వర్టికల్ ఏఐ (భారతదేశంలో ఉన్న ఏఐ నిపుణుల సహాయంతో నిర్దిష్ట విభాగంలో ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఏఐ ఉపయోగించే అంకుర సంస్థలు)
  • కన్జూమర్: భారత్ (భారతదేశంలోని ద్వితీయ శ్రేణి ప్రాంతాల్లోని టాప్ 30 శాతం కుటుంబాల అవసరాలను తీర్చే స్టార్టప్‌లు), ఇండియా నేటివ్ (భారతీయ వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కృషి చేస్తున్న అంకుర సంస్థలు),యాస్పిరేషనల్ బ్రాండ్స్ (భారతదేశంలో జెనరేషన్ Z ప్రజల డిస్క్రిషనరీ వ్యయాలపై ఆధారపడే అంకుర సంస్థలు)
  • ఫిన్‌టెక్: వెల్త్ మేనేజ్‌మెంట్ (డిజిటల్ మాధ్యమాల ద్వారా వ్యక్తిగతీకరించిన వెల్త్ అడ్వైజరీ సేవలను కోరుకునే సంపన్న కస్టమర్లకు సేవలు అందించే అంకుర సంస్థలు), ఫిన్‌టెక్ మౌలిక సదుపాయాలు (వినియోగదారులకు, వ్యాపారాలకు అత్యుత్తమ డిజిటల్ అనుభూతులు అందించే బ్యాంకులు, ఫిన్‌టెక్‌లను ఏకతాటిపైకి తీసుకొస్తున్న స్టార్టప్‌లు),డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ (భారతదేశపు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించి ఆర్థిక సాధనాల వినియోగాన్ని విస్తరించే అంకుర సంస్థలు)
  • తయారీ: ఇండియా టు గ్లోబల్ (డైవర్సిఫైడ్ సరఫరా వ్యవస్థలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ను తీర్చే అంకుర సంస్థలు), ఇండియా నేటివ్ (అత్యున్నత నాణ్యమైన తయారీపై దృష్టి సారించు స్టార్టప్‌లు),ఇండస్ట్రీ 5.0 (సుస్థిరత నాణ్యత పెరిగిన ఉత్పత్తులను తయారు చేయడానికి డిజిటల్ సాంకేతికతను ఉపయోగించే తదుపరి తరం సంస్థలు)

ఆర్థిక అంచనాల ప్రకారం, భారతదేశం దీర్ఘకాలిక సెక్యులర్ వృద్ధికి దారితీస్తుందని, 2024లో 2,700 డాలర్లుగా ఉన్న భారతదేశపు తలసరి జీడీపీ 2029 నాటికి 60% పెరిగి 4,300 డాలర్లకు చేరగలదని అంచనా వేయబడింది. పబ్లిక్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడగలవని అంచనా ఉంది.

గత 10 ఏళ్లలో భారతదేశపు పబ్లిక్ మార్కెట్లు 3 రెట్లు పెరిగాయి. టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు పబ్లిక్ మార్కెట్లలో ప్రధానంగా అభివృద్ధి చెందాయి. యాక్సెల్, ఈ రెండు కంపెనీలలో సీడ్ ఇన్వెస్టర్‌గా వ్యవహరించింది.

“భారత్ ప్రస్తుతం పరివర్తన స్థితిలో ఉంది. మన జీడీపీ త్వరగా వృద్ధి చెందనుంది. ఈ తాజా ఫండ్‌తో, వివిధ పరిశ్రమల ముఖచిత్రాలను మార్చేలా ఏఐ, కన్జూమర్, ఫిన్‌టెక్, తయారీ విభాగాలపై దృష్టి సారిస్తున్నాం” అని యాక్సెల్ పార్ట్‌నర్ ప్రయాంక్ స్వరూప్ అన్నారు.

16 సంవత్సరాలుగా యాక్సెల్ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 80 శాతం సంస్థల్లో ప్రారంభ దశ ఇన్వెస్టర్‌గా ఉన్న యాక్సెల్, పలు ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది.