
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2025: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రముఖ ఛానల్ జీ తెలుగు ఈ ఉగాదికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గ్రాండ్ సెలబ్రేషన్‌కి సిద్ధమైంది. టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, నటన రారాణి రమ్యకృష్ణ, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ మాచిరాజు తదితరులు అతిథులుగా సందడి చేసే ‘ఉగాది మాస్ జాతర’ మార్చి 30న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారంకానుంది.
Read this also…Ugadi 2025 Gets Bigger with Zee Telugu’s Spectacular ‘Ugadi Mass Jathara’ – A Star-Studded Celebration!
Read this also…Panasonic introduces its 2025 AC line-up in South India; designed to withstand extreme temperatures up to 55ᵒC..
ఉగాది శుభ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ షోలో హీరో నితిన్ తన రాబోయే సినిమా ‘రాబిన్హుడ్’ విశేషాలను పంచుకోగా, యాంకర్ రవి-సిరి హోస్ట్‌గా సందడి చేశారు. ఈ షోలో సిటీ వర్సెస్ విలేజ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ రెండు టీమ్‌లను లీడ్ చేస్తూ మేజిక్ క్రియేట్ చేశారు.

అంత్యాక్షరీ, పాటలు, ఆటలు, నవ్వుల వర్షం మధ్య సాగిన ఈ మాస్ జాతరలో డ్రామా జూనియర్స్ కిడ్స్ రమ్యకృష్ణ ముందే ‘నరసింహ’ లెజెండరీ సీన్స్‌ని రీక్రియేట్ చేసి హైలైట్‌గా నిలిచారు. ఇక చందు గౌడ కుమార్తె అక్షరాభ్యాసం వేడుకను ఈ కార్యక్రమంలోనే ఘనంగా నిర్వహించడమే ప్రత్యేక ఆకర్షణ.
స్పెషల్ డ్యాన్స్ ప్రదర్శనలతో అశిక, భూమి, సంగీత, రీతు, మహేశ్వరి, హన్విక స్టేజ్‌ను షేక్ చేయగా, మానస్-తేజస్విని, నిరుపమ్-పల్లవి కాంబినేషన్‌లో ‘పుష్ప 1 & 2’ మిక్స్‌డ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ సినిమాతో రాబోతున్న ప్రదీప్ మాచిరాజు కూడా ఈ షోలో పాల్గొని ఉత్సాహాన్ని పెంచాడు.
Read this also…The GSMA Board elects Gopal Vittal as the new Chairman
Read this also…Shiprocket Unveils Same Day Delivery in Hyderabad, continues to revolutionise eCommerce for India’s MSMEs
సెలబ్రిటీలు, సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్, పండుగ వేడుకల జోష్‌తో నిండిపోయిన ‘ఉగాది మాస్ జాతర’ మీ జీ తెలుగులో ఈ ఆదివారం మిస్ కాకండి!