
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2025: చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బొరబండ సమీపంలోని సున్నం చెరువులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
చెరువుల్లో జరుగుతున్న పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. చెరువుల చుట్టూ సుందరీకరణ, పచ్చదనం పెంపునకు ఉన్న అవకాశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పనుల్లో జాప్యం లేకుండా, నిర్దేశిత కాలవ్యవధిలో పనులను పూర్తి చేయాలని హెచ్చరించారు.