డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,మార్చి 11,2026: సామాజిక మాధ్యమాల్లో తమ బ్రాండ్‌పై వస్తున్న ఆరోపణలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తీవ్రంగా ఖండించింది. కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్లో చేప ఉందంటూ ప్రచారమవుతున్న వార్తలు కేవలం అవాస్తవాలని, వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Read this also..United Breweries Refutes Social Media Claims Regarding Product Quality..
ఇదీ చదవండి..మహిళా దినోత్సవ కానుక: బాలికలకు ‘పరిశుభ్రత కిట్లు’ పంపిణీ చేసిన క్వాలిజీల్..!
తమ తయారీ కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది. తమ బాట్లింగ్ ప్రక్రియ అంతా అత్యాధునిక ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా, సీలు చేసిన వాతావరణంలో జరుగుతుందని పేర్కొంది.
ఇదీ చదవండి..రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సీజన్ 4: మ్యూజిక్ & గేమింగ్ హంగామా షురూ!
ఇదీ చదవండి..కొచ్చి, బెంగళూరులలో హార్లే-డేవిడ్సన్ కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభం..
ఉత్పత్తి దశలో పలుమార్లు నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే బాటిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఇటువంటి పటిష్టమైన నిబంధనల మధ్య అన్య పదార్థాలు బాటిల్లోకి రావడం అసంభమని వివరించింది.

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ప్రతినిధులు సమీక్షిస్తున్నారు. రిటైల్ భాగస్వాములతో కలిసి ఈ అంశంపై విచారణ జరుపుతున్నామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధృవీకరించని సమాచారాన్ని, వీడియోలను షేర్ చేయవద్దని మీడియా సంస్థలను, ప్రజలను కోరింది. వినియోగదారుల భద్రత, విశ్వసనీయతకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని యూబీఎల్ పునరుద్ఘాటించింది.

