డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 16, 2026: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ నగరంలోని జూబ్లీ హిల్స్ రోడ్ నం. 10 వద్ద తన అత్యాధునిక ‘ఆర్టిస్ట్రి స్టోర్’ను ప్రారంభించింది. భారతదేశంలోనే ప్రత్యేకమైన క్యూయేటెడ్ లగ్జరీ జ్యువెలరీ డెస్టినేషన్‌గా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ స్టోర్‌ను బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ఆవిష్కరించగా, వ్యాపార, లగ్జరీ, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహమ్మద్, ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశర్ ఓ, రిటైల్ హెడ్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) సిరాజ్ పి. కె., హైదరాబాద్ జోనల్ హెడ్ మహమ్మద్ షరీజ్ కె. పాల్గొన్నారు.

Read this also..Flipkart Named Among ET Edge’s Best Organisations for Women 2026

ఇదీ చదవండి..క్షీణిస్తున్న రామచంద్ర యాదవ్ ఆరోగ్యం.. మంగళగిరిలో ఉత్కంఠ..!

ఈ సందర్భంగా ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, జ్యువెలరీ రిటైల్‌లో క్యూయేటెడ్, రిలేషన్షిప్ ఆధారిత విధానాల వైపు సంస్థ అడుగులు వేస్తోందన్నారు. వినియోగదారుల అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత అనుభవం, నైపుణ్యం, విశ్వాసం కీలకమవుతున్నాయని, ఈ స్టోర్ ఆ విలువలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుందని చెప్పారు. నాణ్యత, పారదర్శకత, దీర్ఘకాలిక విలువల పట్ల తమ నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ, జ్యువెలరీ ఇప్పుడు వ్యక్తిగత భావాలను, జీవిత ఘట్టాలను, వారసత్వాన్ని ప్రతిబింబించే అంశంగా మారిందన్నారు. ఈ స్టోర్‌లో వినియోగదారుల అనుభవానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకంగా కనిపిస్తోందని, ఇది నిజమైన లగ్జరీ అనుభూతిని అందిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి..బీసీల ఐక్యతే హక్కుల సాధనకు మార్గం: బోడె రామచంద్ర యాదవ్..

ఇదీ చదవండి..ఓట్ల వేళ ‘ప్రేమ’.. గెలిచాక ‘నిర్లక్ష్యం’: బీసీ రాజ్యాధికార పోరాటం ఫలిస్తుందా?

సుమారు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్, ప్రైవసీ, వ్యక్తిగతీకరణ, హై-టచ్ సేవలను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడింది. ప్రపంచ స్థాయి నైపుణ్యం, క్యూయేటెడ్ డిజైన్స్, ఇమర్సివ్ షాపింగ్ అనుభవాన్ని ఒకే చోట అందిస్తూ, ట్రాన్సాక్షన్ ఆధారిత రిటైల్ నుంచి రిలేషన్షిప్ ఆధారిత అనుభవానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ కొత్త దిశగా అడుగులు వేస్తోంది.