డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఆంధ్రప్రదేశ్, 7 మే 2026: బహుళ బిలియన్ డాలర్ల సీకేఏ బిర్లా గ్రూప్‌లో భాగమైన బిర్లా న్యూ , ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈ రోజు తమ మొదటి అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. గవర్నర్‌పేటలోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న ఈ కేంద్రం, గోడలు, ఫ్లోర్లు, పైపులు, పుట్టీ , నిర్మాణ రసాయనాలతో సహా బిర్లా న్యూ యొక్క సమగ్ర ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది.

భారతదేశంలో భవన నిర్మాణ సామగ్రి రంగం సాంప్రదాయకంగా పంపిణీదారుల సంబంధాలు, ధర-ఆధారిత నిర్ణయాల ద్వారా రూపుదిద్దుకుంది. దీనివల్ల ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్‌లు, గృహ యజమానులకు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఉత్పత్తులను నిజంగా పరిశీలించటానికి పరిమిత అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి.

Read this also..Škoda Auto India expands footprint in Hyderabad with a new Customer Touchpoint..

Read this also..Motilal Oswal MF Launches ‘Motilal Oswal Contra Fund’

వాస్తవంగా చెప్పాలంటే, ఇది తరచుగా కేటలాగ్‌లు, ఇతరుల సిఫార్సులు లేదా ధరల పోలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుంది. ఫలితంగా స్పెసిఫికేషన్లలో తేడాలు, సైట్‌లో పనితీరు సమస్యలు, ఖరీదైన రీవర్క్ వంటివి ఏర్పడతాయి.

ఈ అంతరాన్ని పూరించటానికి బిర్లా న్యూ అందించిన సమాధానమే విజయవాడ ఎక్స్‌పీరియన్స్ సెంటర్. ఇది ఊహాగానాలపై కాకుండా, ప్రత్యక్ష అనుభవం ఆధారంగా మరింత నమ్మకమైన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Read this also..L&T Buildings & Factories Business Wins Orders (Large*)

Read this also..Axis Bank Debuts AI-Driven ReKYC for Current Accounts..

బిర్లా న్యూ మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ శ్రీ అక్షత్ సేథ్ మాట్లాడుతూ, “మాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్కెట్‌గా దక్షిణభారతదేశం నిలుస్తుంది. గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్న ప్రాంతానికి కేంద్రంగా విజయవాడ నిలిచింది.

మార్కెట్‌లో మా కార్యకలాపాలను ఎలా పెంచుకోవాలనే దానిపై మా ఆలోచనా విధానాన్ని ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతిబింబిస్తుంది. ప్రధాన మార్కెట్ల వ్యాప్తంగా ఒక విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న మా సంకల్పంలో, ఇది మొట్టమొదటిది..” అని అన్నారు.

విజయవాడ ఎంపిక, ఈ ప్రాంతం యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాల గమనాన్ని ప్రతిబింబిస్తుంది. ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్‌తో సహా, దక్షిణ భారతదేశంలో తమ తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వస్తున్న సంస్థకు, విజయవాడలో వినియోగదారులను ప్రత్యక్షంగా చేరుకునే కేంద్రాన్ని స్థాపించడం- ఒక సునిశితమైన వ్యూహాత్మక నిర్ణయం.