డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,8 అక్టోబర్ 2024: వీడియో సెక్యూరిటీ,సర్వైలెన్స్ ఉత్పత్తులు, పరిష్కారాలు, సేవలను అందిస్తున్న ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ సంస్థ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,300 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు యోచిస్తోంది. ఈ ఇష్యూ కింద షేర్ల ముఖ విలువ రూ. 5 ఉండగా, తాజా ఇష్యూ ద్వారా రూ. 500 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద సెల్లింగ్ షేర్‌హోల్డర్లు రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయిస్తారు.
ఈ ఐపీవోలో భాగంగా బీఎస్ఈ,నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్‌ఇ)లలో షేర్లు లిస్టింగ్ అవుతాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ దేశీయ వీడియో సర్వైలెన్స్ పరిశ్రమలో ఆదాయ పరంగా 20.2% మార్కెట్ వాటాతో అగ్రగామిగా నిలిచింది (మూలం: ఎఫ్‌అండ్‌ఎస్ నివేదిక). ‘సీపీ ప్లస్’ బ్రాండ్ కింద బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్,ఇతర రంగాలలో కస్టమర్లకు సమగ్రమైన వీడియో సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.
ఈ ఐపీవోకి సంబంధించి ఐసీఐసీఐ సెక్యూరిటీస్,ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా (బిఆర్‌ఎల్‌ఎమ్‌లు) వ్యవహరిస్తున్నాయి.