డైలీ మిర్రర్ డాట్ న్యూస్,బెంగళూరు, జనవరి 8, 2026 : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్‌ఎమ్‌సిజి (FMCG) విభాగం ‘రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (RCPL), తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ‘క్యాంపా ష్యూర్’ (Campa Sure) కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

భారతీయ చలనచిత్ర రంగంలో తిరుగులేని నమ్మకానికి, నైపుణ్యానికి నిదర్శనమైన బిగ్ బి.. ఇప్పుడు స్వచ్ఛమైన తాగునీటిని సామాన్యులకు చేరువ చేసే ప్రచారంలో భాగస్వామి అయ్యారు.

అందరికీ స్వచ్ఛమైన నీరు.. అత్యంత తక్కువ ధరకే..!


భారతదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలో పెనుమార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్ ఈ అడుగు వేసింది. మార్కెట్లో మరెక్కడా లేని విధంగా అత్యంత సరసమైన ధరలకే సురక్షితమైన తాగునీటిని అందించడమే ‘క్యాంపా ష్యూర్’ ప్రధాన ఉద్దేశ్యం.

ఇదీ చదవండి..:తొలి వార్షిక సామాజిక బాధ్యత నివేదికను విడుదల చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

ఇదీ చదవండి..:క్రికెట్ ప్రపంచంలో హ్యుందాయ్ హవా: ఐసీసీ టోర్నీలకు ‘ప్రీమియర్ పార్టనర్‌’గా ఒప్పందం

క్యాంపా ష్యూర్ నీరు 10 దశల శుద్దీకరణ ప్రక్రియ తర్వాత వినియోగదారులకు అందుతుంది. ఇది ప్రతి చుక్కలోనూ నాణ్యతను, స్వచ్ఛతను నిర్ధారిస్తుంది.

అన్ని సైజుల్లో..

సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకే సురక్షిత తాగునీటిని అందించడం ద్వారా మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించనుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 250ml నుంచి 20 లీటర్ల వరకు అన్ని రకాల ప్యాకింగ్‌లలో ఈ నీరు లభిస్తుంది.

రెండు దిగ్గజాల కలయిక..

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోదీ మాట్లాడుతూ, “అమితాబ్ బచ్చన్ భారతీయ ఐకాన్. ఆయనలోని స్వచ్ఛత, విశ్వసనీయత మా బ్రాండ్‌కు సరిగ్గా సరిపోతాయి.

దేశంలోని ప్రతి మూలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే మా లక్ష్యానికి ఆయన తోడవ్వడం గర్వకారణం” అని పేర్కొన్నారు. https://campabeverages.com/

బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ, “ప్రతి భారతీయుడికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే క్యాంపా ష్యూర్ ప్రయత్నం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బ్రాండ్‌తో జతకట్టడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని తెలిపారు.

2022లో క్యాంపా బ్రాండ్‌ను స్వాధీనం చేసుకున్న రిలయన్స్, ఇప్పటికే క్యాంపా కోలా, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు తాగునీటి విభాగంలోనూ అగ్రగామిగా ఎదిగేందుకు సిద్ధమైంది.