డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 18, 2026: ప్రముఖ గ్లోబల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రిటైల్ సంస్థ ‘అప్పారెల్ గ్రూప్’ తమ ప్రయాణంలో మరో కీలక అడుగు వేసింది. ఫేమస్ బ్రాండ్ ‘విక్టోరియా సీక్రెట్ ఇండియా’కు మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారి అందాన్ని, వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే గ్లోబల్ బ్రాండ్స్ ‘విక్టోరియా సీక్రెట్’ ,‘పింక్’. తాజాగా ఇవి భారతదేశంలో తమ ‘సమ్మర్ సిగ్నేచర్’ క్యాంపెయిన్‌ను లాంచ్ చేశాయి.

ఇదీ చదవండి..అమెజాన్ నుంచి సరికొత్త ‘AI స్టోర్’.. భారీ డిమాండ్‌తో ప్రత్యేక విభాగం ప్రారంభం!

Read this also..Indira IVF Expands Eastern India Footprint with Strategic Stake in Kolkata’s Abha Surgy Centre..

Read this also..Conflict in West Asia Shakes India’s Travel Sector: Aviation Costs Soar as Inbound Tourism Slumps..

బ్రాండ్ కొత్త లోకల్ అంబాసిడర్ తృప్తి దిమ్రీ ఈ క్యాంపెయిన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. బ్రాండ్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిన ఐకానిక్ స్ట్రైప్ డిజైన్‌తో.. ధరించడానికి ఎంతో కంఫర్ట్‌గా ఉండే లింగరీ, స్లీప్‌వేర్ ఈ కలెక్షన్‌లో ఉన్నాయి. తృప్తి దిమ్రీలోని నాచురల్ కాన్ఫిడెన్స్‌కు, ఈ కలెక్షన్ అందించే గ్లామర్ మరియు కంఫర్ట్ తోడవడంతో ఈ కొత్త సమ్మర్ సిగ్నేచర్ స్టైల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి.

రోజంతా ఎంతో కంఫర్ట్‌గా ఉండేందుకు వీలుగా.. ఈ కలెక్షన్‌లో సిగ్నేచర్ స్ట్రైప్ లోగో టీ-షర్ట్, వైర్‌లెస్ బ్రా, సిగ్నేచర్ స్ట్రైప్ లోగో ప్యాంటీలను తీసుకువచ్చారు. ఇంట్లో క్యాజువల్‌గా, అదే సమయంలో రిచ్‌గా కనిపించేలా స్లీప్‌వేర్ కేటగిరీలో.. సిగ్నేచర్ స్ట్రైప్డ్ సాటిన్ స్లిప్, లాంగ్ పైజామా సెట్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటితో పాటే తృప్తి దిమ్రీ భాగస్వామ్యంతో ‘కూల్ ఎయిర్ కలెక్షన్’ను కూడా బ్రాండ్ లాంచ్ చేసింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన కూల్‌బ్రా™ హైలైట్. ఎండాకాలంలో కూడా ఎంతో చల్లగా, బ్రీతబుల్‌గా ఉండే ప్యాడింగ్, చెమటను త్వరగా ఆరబెట్టే సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ను ఇందులో ఉపయోగించారు. పగలు, రాత్రి ఎప్పుడైనా దీనిని ఎంతో సౌకర్యంగా ధరించవచ్చు.

ఈ సందర్భంగా అప్పారెల్ గ్రూప్ ఇండియా సీఈఓ అభిషేక్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. “విక్టోరియా సీక్రెట్ బ్రాండ్‌కు భారత్ ఎప్పుడూ అత్యంత కీలకమైన, వేగంగా ఎదుగుతున్న మార్కెట్. ఆత్మవిశ్వాసం, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, గ్లోబల్ ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉన్న నేటి తరం యువతకు తృప్తి దిమ్రీ కరెక్ట్‌గా సరిపోతారు” అని చెప్పారు.

విక్టోరియా సీక్రెట్‌తో భాగస్వామ్యంపై నటి తృప్తి దిమ్రీ స్పందిస్తూ.. “మహిళల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ.. తమ పట్ల తాము ఎంతో నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా ప్రోత్సహించే విక్టోరియా సీక్రెట్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారడం చాలా సంతోషంగా ఉంది. సిగ్నేచర్ కూల్‌బ్రా, సమ్మర్ సిగ్నేచర్ కలెక్షన్స్ పూర్తిగా కంఫర్ట్ ,ఈజ్ ఆధారంగా డిజైన్ చేశారు. ఇవి నా అభిరుచికి, నా లైఫ్‌స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి” అని తన ఆనందాన్ని పంచుకున్నారు.

గత కొన్నేళ్లుగా అప్పారెల్ గ్రూప్ భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ బ్రాండ్‌ను వేగంగా విస్తరిస్తోంది. ప్రధాన నగరాల్లో రిటైల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా, తమ వెబ్‌సైట్, యాప్ ద్వారా కస్టమర్లకు బెస్ట్ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. తృప్తి దిమ్రీ ఎంపిక.. భారతీయ మార్కెట్ పట్ల విక్టోరియా సీక్రెట్‌కు ఉన్న ఆసక్తిని, ఫ్యాషన్ ప్రియులకు మరింత చేరువ కావాలన్న వారి లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.