డైలీ మిర్రర్ డాట్ న్యూస్,7 అక్టోబర్ 2024: భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ తమ 450X,450 అపెక్స్ స్కూటర్‌లపై ప్రత్యేక పండుగ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లలో భాగంగా 450X,450 అపెక్స్ లో గరిష్టంగా రూ. 25,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది, వీటితో పాటుగా విస్తరించిన బ్యాటరీ వారంటీ, ఉచిత ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్, నగదు తగ్గింపులు, అలాగే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి
ఏథర్ 450X పై ప్రత్యేకమైన పండుగ ఆఫర్‌లు
ఏథర్ 450X మోడల్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు, ప్రో ప్యాక్ యాక్సెసరీతో పాటు, రూ. 15,000 విలువైన ఖచ్చితమైన ప్రయోజనాలను పొందుతారు, వీటిలో ఈ దిగువ ప్రయోజనాలు ఉన్నాయి:
.ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 8-సంవత్సరాల పొడిగించిన బ్యాటరీ వారంటీ (EBW).
.1 సంవత్సరకాలానికి ఉచిత ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్, గరిష్టంగా రూ. 5,000 వరకూ అది ఉంటుంది
.కొనుగోలుపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్ తగ్గింపు.
ఈ ప్రయోజనాలతో పాటు, కస్టమర్‌లు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు, తద్వారా మొత్తం ప్రయోజనాల విలువ రూ. 25,000 వరకు చేరుతుంది.
450 అపెక్స్‌లో ప్రత్యేక ఆఫర్‌లు
450 అపెక్స్ అనేది 450 ఉత్పత్తి శ్రేణికి సరికొత్త జోడింపు. పనితీరు పరంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పండుగ సీజన్‌లో, ఏథర్ 450Xతో సమానమైన రూ. 25,000 విలువైన మొత్తం ప్రయోజనాలను అపెక్స్ పై అందిస్తోంది.
ఏథర్ ,450 సిరీస్ స్కూటర్లు పనితీరు, సాంకేతికత,విశ్వసనీయతను మిళితం చేస్తాయి. 2.9 kWh బ్యాటరీతో 450X,3.7 kWh బ్యాటరీతో 450X వరుసగా 111km,150km ఐడిసి పరిధిని అందిస్తాయి. ఇవి గరిష్టంగా 90Km/h వేగాన్ని అందిస్తాయి.
450 అపెక్స్ 157 కిమీల IDC పరిధిని,100km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లు AutoHold, FallSafe,Google Maps ప్లాట్‌ఫారమ్ ఇంటిగ్రేషన్‌తో 17.7cm (7”) TFT టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. అదనంగా, డ్యాష్‌బోర్డ్ పైనే వాట్సాప్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్లు రైడర్,కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.
టో & థెఫ్ట్ నోటిఫికేషన్‌లు,ఫైండ్ మై స్కూటర్‌లు వంటి ఫీచర్స్ రైడింగ్ అనుభవాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, 450 అపెక్స్ మేజిక్ ట్విస్ట్ ఫీచర్‌తో వస్తుంది, ఇది అదే థొరెటల్‌ని ఉపయోగించి వేగవంతం చేయడానికి,వేగాన్ని తగ్గించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఏథర్ ఎనర్జీ కూడా రైడర్‌లకు సౌకర్యవంతమైన,ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉంది. ఏథర్ గ్రిడ్ అని పిలువబడే ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 2152 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 230 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను కలిగి ఉంది.
వినియోగదారులు ఏథర్ స్కూటర్‌లను టెస్ట్ రైడ్ చేయటం తో పాటుగా కొనుగోలు చేయవచ్చు. తమిళనాడులోని హోసూర్‌లో ఏథర్‌కు 2 తయారీ కర్మాగారాలు ఉన్నాయి, వాహనాల అసెంబ్లింగ్,బ్యాటరీ తయారీకి ఒక్కొక్కటి ఉండగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని బిడ్కిన్, AURICలో మూడవ తయారీ కేంద్రం రాబోతుంది.