డైలీ మిర్రర్ డాట్ న్యూస్,బెంగళూరు, 17 అక్టోబర్ 2024: భారతదేశంలో విద్యుత్ ద్విచక్ర వాహనాల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ తమ వినియోగదారుల కోసం ఏథర్ కేర్ సర్వీస్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఏథర్ కేర్ ప్లాన్‌లు ఉచిత పీరియాడిక్ నిర్వహణ అవసరాలను తీరుస్తాయి, వేర్-అండ్-టియర్ పార్ట్ రీప్లేస్‌మెంట్‌లపై తగ్గింపులను అందిస్తాయి.
ఎక్స్‌ప్రెస్‌కేర్ ,పాలిషింగ్ వంటి విలువ ఆధారిత సేవలపై కూడా తగ్గింపు ధరలను అందిస్తూ వినియోగదారులకు సౌలభ్యం,పొదుపు రెండింటినీ అందిస్తాయి.
తొలి 3 సంవత్సరాల వారంటీ తరువాత ఎక్కువ మంది కస్టమర్‌లు ఇతర మార్గాల వైపు మారడంతో, పీరియాడిక్ నిర్వహణ, ఆర్థిక భారంను తగ్గించడంలో సహాయపడే ప్లాన్ యొక్క ఆవశ్యకతను ఏథర్ గుర్తించింది. ఏథర్ కేర్ మూడు రకాల కేర్ ప్లాన్‌లను అందిస్తుంది.
అవి ఏథర్ కేర్, ఏథర్ కేర్ ప్లస్,ఏథర్ కేర్ మ్యాక్స్- కస్టమర్‌లు తమ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఇవి అనుమతిస్తాయి. ఈ మూడు ఏథర్ కేర్ ప్లాన్‌లూ 1 సంవత్సరం లేదా 10,000కి.మీల వ్యవధిని కవర్ చేసేలా రూపొందించబడ్డాయి, ఏది ముందుగా వస్తే అది వర్తించే ఈ ప్లాన్ లు ఏథర్ యజమానులకు సమగ్ర నిర్వహణ ఎంపికలను అందిస్తాయి.
ఏథర్ కేర్ ప్లాన్‌ల వివరాలు:
- ఏథర్ కేర్: రెండు ఉచిత పీరియాడిక్ నిర్వహణలు, వేర్ అండ్ టియర్ పార్ట్‌లపై సంవత్సరానికి ఒకసారి 10% తగ్గింపు,సంవత్సరానికి ఒకసారి వేర్ అండ్ టియర్ రీప్లేస్‌మెంట్స్ కోసం లేబర్‌పై 10% తగ్గింపు ఉంటుంది.
- ఏథర్ కేర్ ప్లస్: 2 ఉచిత పీరియాడిక్ నిర్వహణలు, 1 ఉచిత పాలిషింగ్, 1 ఉచిత వాష్, వేర్ అండ్ టియర్ పార్ట్స్‌పై10% తగ్గింపు (సంవత్సరానికి రెండుసార్లు),వేర్ అండ్ టియర్ రీప్లేస్‌మెంట్స్ కోసం లేబర్‌పై 15% తగ్గింపు (సంవత్సరానికి రెండుసార్లు ).
- ఏథర్ కేర్ మాక్స్: 2 ఉచిత పీరియాడిక్ నిర్వహణలు, 2 ఉచిత బ్రేక్ ప్యాడ్ రీప్లేస్‌మెంట్‌లు, 2 ఉచిత వాష్‌లు, 2 ఉచిత ఎక్స్‌ప్రెస్‌కేర్ సేవలు, 2 ఉచిత పాలిషింగ్‌లు, ఉచిత బెల్ట్ లూబ్రికేషన్, వేర్ అండ్ టియర్ పార్ట్‌లపై10% తగ్గింపు (సంవత్సరానికి రెండుసార్లు),వేర్ అండ్ టియర్ రిప్లేస్మెంట్స్ కోసం లేబర్ పై 15% తగ్గింపు (సంవత్సరానికి రెండుసార్లు).
కస్టమర్‌లు సెప్టెంబర్ 30, 2024 నాటికి ఉన్న ఏథర్,అధీకృత 210 సర్వీస్ సెంటర్‌లు లేదా 230 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ల వద్ద ఏదైనా ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.వారు తమ ప్లాన్‌ను కొనుగోలు చేసే డీలర్‌షిప్‌లో ప్రత్యేకంగా తమ ఏథర్ కేర్ ప్రయోజనాలను రీడీమ్ చేసుకోవచ్చు. ప్లాన్‌ల ధరలు రూ. 1130 నుండి రూ. 2400 వరకు ఉంటాయి.
ప్లాన్, అది కొనుగోలు చేసిన నగరాన్ని బట్టి కస్టమర్‌లకు రూ. 5900 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఏథర్ కేర్ ప్లాన్‌లతో, ఈవీ యజమానుల నడుమ వున్న కీలకమైన ఆందోళనను, అంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల నిర్వహణ ,అధిక ధర వంటి సమస్యలను ఏథర్ పరిష్కరిస్తుంది.