
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,డిసెంబర్ 5, 2024: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫండ్ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, తమ కొత్త ఫండ్ ఆఫర్ –యాక్సిస్ క్రిసిల్-IBX AAA బాండ్ NBFC-HFC – జూన్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఇది క్రిసిల్- IBX AAA NBFC-HFC ఇండెక్స్ – జూన్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఈ స్కీములో ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్క్,సాపేక్షంగా తక్కువ క్రెడిట్ రిస్క్ ఉంటాయి.
ఈ ఫండ్‌ను ఆదిత్య పగారియా నిర్వహిస్తారు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 5,000. ఆపైన రూ. 1/- గుణిజాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎగ్జిట్ లోడ్ లేదు.
యాక్సిస్ క్రిసిల్-IBX AAA బాండ్ NBFC-HFC జూన్ 2027 ఇండెక్స్ ఫండ్

ట్రాకింగ్ ఎర్రర్‌కి లోబడి, CRISIL-IBX AAA NBFC-HFC ఇండెక్స్ – జూన్ 2027 లోని సెక్యూరిటీల ద్వారా వచ్చే రాబడికి దాదాపు సరిసమానంగా, ఫీజులు,ఖర్చులకు ముందు, రాబడిని అందించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ఈ పథకం పెట్టుబడి లక్ష్యాలు నెరవేరతాయనే నిర్దిష్ట హామీ లేదు.
ఈ పథకం క్రిసిల్-IBX AAA NBFC-HFC Index – జూన్ 2027 సూచీని ప్రతిబింబించేలా ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో 95% నుంచి 100% నిధులను కేటాయిస్తుంది. మిగతా మొత్తాన్ని లిక్విడిటీ అవసరాల రీత్యా డెట్ మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫండ్ ఓపెన్-ఎండెడ్ స్వభావం వల్ల, పెట్టుబడిదారులు తమ లక్ష్యాల సాధనకు అనుగుణంగా, ఫండ్‌లో ప్రవేశించడానికి,నిష్క్రమించడానికి, క్రమబద్ధమైన పెట్టుబడి, ఉపసంహరణ విధానాల వెసులుబాట్లను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫండ్, క్రిసిల్-IBX AAA NBFC-HFC ఇండెక్స్ – జూన్ 2027లోని సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఒక ప్యాసివ్ ఫండ్. ఇది వ్యయాలకు ముందు, సదరు సూచీకి అనుగుణమైన పనితీరును కనపరుస్తుంది. అంతేగాకుండా, ఈ ఫండ్, ‘బై అండ్ హోల్డ్’ అనే పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ విధానంలో రిడెంప్షన్లు,రీబ్యాలెన్స్ కోసమైతే తప్ప ఎన్‌బీఎఫ్‌సీలు,హెచ్ఎఫ్‌సీల డెట్ సాధనాలను విక్రయించకుండా మెచ్యూరిటీ తేదీ వరకు అలాగే కొనసాగిస్తారు.
ఈ ఇండెక్స్‌లో 100% కేటాయింపులు బాండ్లకే ఉంటాయి; ఇందుకు అర్హత ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
.నిర్దిష్ట వ్యవధిలో మెచ్యూరిటీకి సంబంధించి కనీసం రూ. 400 కోట్లు అవుట్‌స్టాండింగ్ ఉండే, దీర్ఘకాలికంగా ఒక మోస్తరు AAA రేటింగ్ కలిగి ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ (ఆర్‌బీఐ వద్ద ఉండే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) జాబితాలోనివి), హెచ్ఎఫ్‌సీ (nhb.org.in వెబ్‌సైట్లో పేర్కొన్న జాబితాలోనివి) ఇష్యూయర్లు.
.కనీస అవుట్‌స్టాండింగ్ సెక్యూరిటీ పరిమాణం రూ. 100 కోట్లు.
.లిస్టెడ్ ఇష్యూయర్లు మాత్రమే ఇండెక్స్‌లో చేర్చబడతాయి. సూచీ ప్రారంభ తేదీ నాటికి మదింపు ప్రకారం, ఏదేని ఒక సెక్యూరిటీనైనా లిస్ట్ చేసిన ఇష్యూయర్‌ను లిస్టెడ్ ఇష్యూయర్‌గా పరిగణిస్తారు.
ఫండ్ ప్రధాన ఫీచర్లు:

.ఇండెక్స్ YTM: ~7.70 – 7.75%
.తక్కువ వ్యయాలతో కూడుకున్న ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్: మిగతా వాటితో పోలిస్తే తక్కువ వ్యయాలతో కూడుకున్న ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైన సొల్యూషన్
.అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియో: ప్రధానంగా AAA రేటెడ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది, మిగతా మొత్తాన్ని లిక్విడిటీ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తుంది
.సెక్యూరిటీల ఎంపికలో పక్షపాత ధోరణులు తక్కువ: ఫండ్ ప్యాసివ్‌గా నిర్వహించబడుతుండటం.క్రిసిల్-IBX AAA NBFC-HFC – జూన్ 2027ను ప్రతిఫలించే విధంగా ఉండటం వల్ల సెక్యూరిటీల ఎంపికలో పక్షపాత ధోరణి తగ్గుతుంది.
.సరళమైనది మరియు సులభతరమైనది: టార్గెట్ మెచ్యూరిటీ NBFC-HFC సెక్టార్ పోర్ట్‌ఫోలియో. పూర్తి వివరాల కోసం మా వెబ్‌సైట్‌లో లభించే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌ను చూడగలరు.
* ఈ స్కీమ్‌లో పెట్టుబడిపై రాబడులకు సంబంధించి యాక్సిస్ AMC ఎటువంటి హామీ ఇవ్వదు.

పై ఫీచర్‌లు 2024 డిసెంబర్ 3 నాటికి గల ఇండెక్స్ వివరాలపై ఆధారితమైనవి.
“యాక్సిస్ క్రిసిల్-IBX AAA బాండ్ NBFC-HFC – జూన్ 2027 ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెడుతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. ఇది మా డెట్ పథకాలకు మరో వ్యూహాత్మకమైన జోడింపు కాగలదు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న NBFC,HFC రంగం సామర్థ్యాల నుంచి ప్రయోజనం పొందేలా మదుపర్లకు ఈ ఫండ్ ఒక అవకాశాన్ని అందిస్తుంది.
ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మదుపర్లు అత్యంత నాణ్యమైన, AAA- రేటెడ్ డెట్ సెక్యూరిటీల వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఫండ్ ప్యాసివ్ స్వభావమనేది పారదర్శకత,వ్యయాల ఆదాకు తోడ్పడుతుంది” అని NFO ప్రారంభంపై యాక్సిస్ AMC MD & CEO శ్రీ బి. గోప్ కుమార్ చెప్పారు.
ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2024 డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 10 వరకు తెరిచి ఉంటుంది.
మరింత సమాచారం కోసం దయచేసి www.axismf.com ను సందర్శించండి.